Big Stories

MLA Padi Kaushikreddy new case: కొత్త చట్టం.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌పై తొలి కేసు, ఎందుకంటే..

MLA Padi Kaushikreddy new case: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌రెడ్డిపై కొత్త చట్టం కింద కేసు నమోదైంది. కొత్త చట్టం వచ్చిన రెండురోజులకే ఎమ్మెల్యేలపై నమోదైన తొలి కేసు ఇదే. జిల్లా పరిషత్ సమావేశంలో విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంతకీ కేసు నమోదు చేయడానికి గల కారణాలపై ఇంకా లోతుల్లోకి వెళ్తే…

- Advertisement -

మంగళవారం కరీంనగర్ జిల్లాలో జిల్లా పరిషత్ సమావేశాలు జరిగాయి. జెడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన చివరి సమావేశం జరిగింది. దీనికి కలెక్టర్ పమేలా సత్పతి, డిప్యూటీ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

- Advertisement -

సమావేశం మధ్యలో తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కలెక్టర్ పమేలా సత్పతి వెళ్లడాన్ని అవమానంగా భావించారు సదరు ఎమ్మెల్యే. ఆమె వెళ్లే దారిలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. కొద్దిసేపటి తర్వాత కలెక్టర్ బయటకు వెళ్లారు. పరిస్థితి గమనించిన జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత న్యాయ సంహిత యాక్ట్ కింద 122, 126 (3) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.

సమావేశం తర్వాత బయట మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, విద్యాశాఖ ప్రగతిపై తాను సమీక్ష నిర్వహించాన న్నారు. దీనికి హాజరైన ఎంఈవోలకు జిల్లా విద్యాశాఖ అధికారి మెమోలు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ జడ్పీటీసీలు డీఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ALSO READ: మానేరువాగుపై కూలిన బ్రిడ్జి.. 3 నెలల్లో రెండోసారి..

ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీనిపై సమాధానం చెప్పాలని తాను కలెక్టర్‌ను డిమాండ్ చేశానని వివరించారు. పోలీసులకు తనకు మధ్య చిన్న వాగ్వాదం జరిగిందని గుర్తు చేశారు. దీనిపై కేసు నమోదు చేస్తారా అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.

 

 

 

 

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News