Big Stories

MLA Bandla Krishna Mohan Reddy: గద్వాలలో వేడెక్కిన రాజకీయాలు.. హస్తం గూటికి మరో ఎమ్మెల్యే?

MLA Bandla Krishna Mohan Reddy To Join Congress(TS Politics): బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఆ పార్టీ కీలక నేత గుడ్ బై చెప్పనున్నారు. కారు గుర్తుపై గెలిచిన జోగుళాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి జూపల్లిని హైదరాబాద్‌లో కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రానున్న వారం రోజుల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ అధిష్టానం మరో రెండు నుంచి మూడు రోజుల్లో సమావేశం కానుంది. ఈ కీలక భేటీ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో గందరగోళం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యేకు, జెడ్పీ చైర్ పర్సన్ సరితకు గత కొంతకాలంగా విబేధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిత కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. నేటితో జెడ్పీ చైర్ పర్సన్ సరిత పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎమ్మెల్యే బండ్ల పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.

- Advertisement -

పార్టీ మార్పు విషయంపై ఎమ్మెల్యేను అడగగా.. ప్రజల కోసం పార్టీ మారడానికి సిద్ధమేనని జోగుళాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెల్లడించారు. అభివృద్ధి కోసం పార్టీ మారాలని కార్యకర్తలు అడుగుతున్నారని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్‌లోకి రావాలని మంత్రి జూపల్లి ఆహ్వానించింది నిజమేనని ఎమ్మెల్యే చెప్పారు.

కాగా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని నల్లగుంటలో ఓ కాంగ్రెస్ కార్యకర్త సెల్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో గద్వాల జిల్లాలో రాజకీయాలు వేడుక్కుతున్నాయి.

Also Read: క్యూలో తలసాని.. వలసలు ఆపడానికి కేసీఆర్ హైరానా

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొదట టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2009లో గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన..2014 ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఆ తర్వాత 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News