Big Stories

Miyapur Land Issue: మియాపూర్‌లో 144 సెక్షన్..డ్రోన్లతో పోలీసుల గస్తీ..!

144 Sections Imposed in Miyapur: మియాపూర్‌ దీప్తిశ్రీనగర్‌లో ఉద్రికత్త చోటుచేసుకుంది. భూ ఆక్రమణల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తూ సైబరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 29 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. మియాపూర్, చందానగర్ పీఎస్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉండనుంది.

- Advertisement -

మియాపూర్ పరిధిలోని 100,101 సర్వేనంబర్లలో పెద్దఎత్తున బలగాలు మోహరించాయి. ఈ వివాదాస్పద ప్రభుత్వ భూముల్లో డ్రోన్లతో పోలీసులు గస్తీ కాస్తున్నారు. అలాగే ప్రభుత్వ భూమిపై తప్పుడు ప్రచారం చేసిన సంగీత, సీత, సంతోష్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు.పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

- Advertisement -

ప్రభుత్వ భూములను ఆక్రమించుకుందామంటూ ఓ ఫంక్షన్ హాల్‌లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సంగీత, సీతలు కలిసి మహిళలను రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. దీంతో సామాన్య ప్రజలు అక్కడికి చేరుకొని భీష్మించి కూర్చున్నారు.

Also Read: BRS New plan: బీఆర్ఎస్ ప్లాన్, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు.. మహారాష్ట్ర ఫార్ములా

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారులను పోలీసులు ఖాళీ చేయించారు. శనివారం జరిగిన ఉద్రికత్తల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భూముల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు పహారా, బారికెడ్లు ఏర్పాటు చేశారు.

అసలేం జరిగింది..?
దీప్తిశ్రీనగర్‌లో ఉన్న 100, 101 సర్వే నంబర్లలో సుమారు 500 ఎకరాల హెచ్ఎండీఏ భూమిని పేదలకు కేటాయిస్తున్నారని ప్రచారం విపరీతంగా వ్యాపించింది. ముఖ్యంగా వాట్సప్‌లో మెసేజ్‌లు పెద్ద మొత్తంలో వ్యాప్తి చెందడంతో సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చారు.

Also Read: TG IAS Transfers : తెలంగాణలో మరోసారి ఐఏఎస్ ల బదిలీలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలి

దాదాపు రెండు వేల మంది గుడిసెల వేసుకున్నారు. విషయం తెలుసుకున్న హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు అక్కడికి వెళ్లి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ భూమిని ఎవరికి కేటాయించలేదని, వెంటనే ఖాళీ చేయాలని చెప్పడంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News