Big Stories

Shridhar Babu: మీరు వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

Counter to BRS Leaders Harishrao and KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామంటూ ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మీరు వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే.. హరీశ్ రావు పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. మేం తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం.. ఏపీ ఆలోచనలు కాదు. 12 ఏళ్ల తరువాత గ్రూప్-1 పరీక్షను మేమే నిర్వహించాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేస్తాం. మూడు నెలలు పరిపాలన చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడే ఎలక్షన్ కోడ్ ముగిసింది. హామీలను అమలు చేస్తాం. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్ రావుకు లేదు. వాళ్ల హయాంలో గుర్రాలతో ఆశా వర్కర్లను తొక్కించారు. పెద్దపల్లిలో జరిగినటువంటి ఘటనపై విచారణ కొనసాగుతుంది. ఆ ఘటన జరగడం దురదృష్టకరం. శాంతి భద్రత విషయంలో మా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటది. వెనుక ఎవరి హస్తం ఉన్నా ఉక్కుపాదంతో అణచివేస్తాం’ అంటూ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

- Advertisement -

ఇటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలపై మాట్లాడితే అక్రమ కేసులు పెట్టారన్నారు. ఏనాడు కూడా గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. పదేండ్లలో మీరు సృష్టించిన సమస్యలను పరిష్కరించుకుంటూ విద్యార్థులకు న్యాయం చేస్తున్నామని ఆయన అన్నారు. ‘మీ పదేండ్ల పాలన.. మా ఆరు నెలల పాలన’పై చర్చకు మేం రెడీ అంటూ వెంకట్ సవాల్ విసిరారు.

- Advertisement -

‘మీకు.. మీ బామ్మర్ధికి మధ్య జరుగుతున్న గొడవలు బయటకు రాకుండా ఉండేందుకే ఇవన్నీ సృష్టిస్తున్నారు’ అంటూ హరీశ్ రావుపై ఎమ్మెల్సీ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినవారికి తమ ప్రభుత్వం అవకాశమిస్తుందని.. మీలాగే వారి గొంతులు నొక్కలేదంటూ ఆయన పేర్కొన్నారు. మీ ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు పడ్డాయో అందరికీ తెలుసు.. మా పాలనలో మాత్రం ఒకటో తేదీనే ఇస్తున్నామన్నారు.

Also Read: ఖైరతాబాద్ విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభం.. ఈసారి ఎత్తు ఎంతంటే..?

‘తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పు దోవ పట్టించొద్దు హరీశ్ రావు.. సమస్యలు ఉంటే నాతో చెప్పండి.. సీఎం దగ్గరకు నేను తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా’ అంటూ ఎమ్మెల్సీ అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News