Big Stories

Seethakka Legal Notice to KCR: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

Minister Seethakka Legal Notice to KCR and BRS Party: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులోనూ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే మాత్రం మరింత దారుణంగా తయారవుతుంది. గులాబీ బాస్ కేసీఆర్ కు నిన్నమొన్నటి వరకు ఎంతో నమ్మకంగా ఉన్న కీలక నేతలంతా ఒక్కొక్కరుగా నెమ్మదిగా జారుకుంటున్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు.

- Advertisement -

దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోవటమే పెద్ద దెబ్బ అనుకుంటే.. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేని స్థాయికి చేరుకోవడం తేరుకోలేని దెబ్బగా భావిస్తున్న క్రమంలో పార్టీని ఎలా కాపాడుకోవాలని గులాబీ బాస్ తలపట్టుకుంటున్నారు. అందుకే ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నేతలతో వరుస సమీక్షలు చేస్తున్నారు. పార్టీ మారొద్దంటూ వారికి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కు మరో మరో షాక్ తగిలింది.

- Advertisement -

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికారిక ఎక్స్ ఖాతాలో తనను ఉద్దేశిస్తూ పోస్టులు పెట్టారంటూ మంత్రి సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్ కావటంతో.. ఆ పోస్టుకు పార్టీ అధినేత కేసీఆర్ ను బాధ్యుడిగా పరిగణిస్తూ ఆయనకు మంత్రి సీతక్క నోటీసులు జారీ చేశారు.

తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారంటూ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదంటూ ఆమె హెచ్చరించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు గానూ.. తక్షణమే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులో సీతక్క డిమాండ్ చేశారు.

Also Read: ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

అయితే, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లు, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం న్యాయ కమిషన్ వేసింది. ఆ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. దానిపై స్పందించిన కేసీఆర్ తిరిగి ఆ కమిషన్ కు లేఖ రాశారు. ఆ తరువాత ఆ కమిషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కేసీఆర్ కు చుక్కెదురయ్యింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. ఇటు ఎన్నికల్లో ఓటమి.. ఇటు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం.. మరోవైపు కోర్టులో చుక్కెదురుతో తీవ్ర ఆందోళనలో ఉన్న కేసీఆర్.. ఈ నోటీసులపై స్పందిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి మరి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News