Big Stories

Loksabha Elections result 2024, Shock to BRS: కారుకి షాకిచ్చిన ఫలితాలు, కేవలం రెండు సీట్లలో…

Loksabha Elections result 2024, Shock to BRS(Telangana politics): తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార కాంగ్రెస్-బీజేపీ ఎనిమిదేసి సీట్లను గెలుచుకున్నాయి. ఎప్పటి మాదిరిగానే ఎంఐఎం తన సీటును నిలబెట్టుకుంది. ఈసారి ఎన్నికల్లో బాగా నష్టపోయింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే.

- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కారు పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా తన వైభవాన్ని కోల్పోయింది. కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు వంటి నేతలు ప్రచారం చేసినప్పటికీ ఒక్కసీటు లోనూ విజయం సాధించలేకపోయింది. బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న మెదక్‌లో బీజేపీ గెలవడం దేనికి సంకేతం? పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయారు.

- Advertisement -

గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది. అంతేకాదు మొత్తం 17 నియోజకవర్గాల్లో ఖమ్మం, మహబూబాబాద్‌లో మాత్రమే సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. మిగతా 14 చోట్ల మూడో స్థానానికి పరిమితమైంది. హైదరాబాద్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.

ఇక కాంగ్రెస్-బీజేపీ విషయానికొద్దాం. ఇరు పార్టీలకు సమాన సీట్లు వచ్చినా, ఓట్ల శాతంలో కాంగ్రెస్ అధిక్యాన్ని ప్రదర్శించింది. తాజాగా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు రాగా, బీజేపీ 35 శాతంతో సరిపెట్టుకుంది. ఇక కారు పార్టీ కేవలం 16 శాతానికి మాత్రమే పరిమితమైంది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్లినట్టు ఫలితాలను బట్టి తెలుస్తోంది. పైకి త్రిముఖ పోటీలా కనిపించినా ప్రధాన పోటీ కాంగ్రెస్-బీజేపీల మధ్యే సాగినట్టు కనిపిస్తోంది.

ALSO READ:  చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి

ఈ లెక్కన రాబోయే రోజుల్లో కారు పార్టీకి కష్టాలు తప్పవన్నది ఆ పార్టీలోని దిగువ స్థాయి నేతల మాట. ఈసారి తెలంగాణలో టీడీపీ యాక్టివ్ కానుంది. ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు మాట్లాడారు. ఈసారి తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ లెక్కన రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం ఖాయమన్నమాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News