Big Stories

Operation Akarsh : కారులో ఉండేదెవరు.. కాంగ్రెస్ లో చేరేదెవరు ? ఆపరేషన్ ఆకర్ష్ తో గులాబీపార్టీ పరేషాన్

Leaders Ready to Shift into Congress Party : శాసన మండలిలో తమ సభ్యులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. శాసనమండలిలో మొత్తం 40మంది సభ్యులుండగా వీరిలో 29మంది బీఆర్ఎస్ పార్టీవారే. కాంగ్రెస్‌కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలే ఉన్నారు. ఇప్పుడు హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ కావడంతో గులాబీపార్టీలో గుబులు మొదలైంది. త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఎలాగైనా గులాబీదళం బలం తగ్గించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గట్టి కసరత్తు చేస్తోంది.

- Advertisement -

శాసనమండలిలో పలు కీలక బిల్లుల ఆమోదానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుపడే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ వారికి గాలం వేస్తోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. వీరు పార్టీని వీడి కాంగ్రెస్‌తో జతకట్టేందుకు సిద్దమయ్యారనే టాక్ వినిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం అలర్ట్ అయింది. ఎవరెవరు పార్టీమారే అవకాశం ఉందో ఆరా తీస్తోంది. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండేవారి నుంచి వివరాలు సేకరిస్తుంది.

- Advertisement -

Also Read : నో వర్క్ .. నో పోస్ట్.. డైలమాలో కేటీఆర్ ఫ్యూచర్

బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు తమపార్టీతో చేరితే పదవులు,నిధులు ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఇచ్చినప్పటికీ మరో కొంతకాలం పదవి ఉండాలంటే పార్టీ మారడం శ్రేయస్కరమని కొందరు ఎమ్మెల్సీలు భావిస్తున్నట్టు టాక్. అందులో భాగంగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కొందరికి పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్ చేస్తే వారినుంచి సరైన సమాధానం రాలేదని.. అలాగని పార్టీలో కొనసాగుతామని కూడా చెప్పలేదు. దీంతో 29మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలలో కనీసం 10మందైనా మిగులుతారా అనే సందేహం కారుపార్టీని ఠారెత్తిస్తోంది.

వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న ఆరుగురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా పేరుగాంచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ భవిష్యత్తుకోసం పార్టీ మారేందుకు వీరు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తీరును, టికెట్ల కేటాయింపును వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ బహిరంగంగానే తప్పుబట్టారు. ఆయన నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ కంచుకోటగా మారడంతో పార్టీమారాలని అనుచరగణం ఒత్తిడి చేస్తోంది. మరో ఎమ్మెల్సీపై కూడా అనుచరులు పార్టీ మారాలని ఇలాగే ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోకి వస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని రేవంత్‌కు సన్నిహితుడైన ఎమ్మెల్యే ఒకరు ఆ ఎమ్మెల్సీకి చెప్పినట్టు తెలిసింది. ఈ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీకి కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన కూడా కాంగ్రెస్‌లోకి జంప్ చేసే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News