Big Stories

KTR : పట్టణాల అభివృద్ధికి నిధులివ్వండి.. కేంద్రానికి కేటీఆర్ లేఖ

KTR : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పట్టణాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి నగరాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తెలంగాణకు నిరాశే ఎదురవుతోందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. వివక్షతోనే ఇప్పటివరకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం మొండి చేయి చూపినా అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని తెలిపారు. ఇందుకు కేంద్రం ఇస్తున్న అవార్డులు, రివార్డులే నిదర్శమని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికైనా తెలంగాణకు నిధులు కేటాయిస్తారన్న నమ్మకంతో లేఖ రాస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. గతంలోనూ చాలా సార్లు కేంద్రానికి నిధులు, ప్రాజెక్టుల కోసం కేటీఆర్ లేఖలు రాశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News