Big Stories

KTR met with Kavitha: కవితతో కేటీఆర్ ములాఖత్, కాస్త ఎమోషన్..

KTR met with Kavitha(Political news in telangana): మద్యం కుంభకోణం కేసు ఎంత వరకు వచ్చింది? ఈ కేసు నిమిత్తం ఇప్పటికే చాలామంది నిందితులు జైలులో ఉన్నారు. ఎప్పటికప్పుడు బెయిల్ పిటిషన్లు సెషన్, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసినప్పటికీ ఏమాత్రం ఫలితం మాత్రం కనిపించలేదు. ఈడీ, సీబీఐ అభ్యంతరాలపై న్యాయస్థానం వాళ్ల బెయిల్ పిటిషన్లు తోసిపుచ్చుతోంది.

- Advertisement -

తాజాగా తీహార్ జైలులో ఉన్న తన చెల్లెలు కవితను శుక్రవారం ములాఖత్ అయ్యారు అన్న కేటీఆర్. ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో అన్నాచెల్లెలు కాస్త ఎమోషన్ అయినట్టు తెలుస్తోంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. పిల్లలు గురించి అడిగి తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి కేటీఆర్ బయటకు వచ్చేశారు.

- Advertisement -

ఈ కేసులో టాప్ పొలిటీషియన్లు జైలులో ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్యే కవితతోపాటు మరికొందరు అదే జైలులో ఉన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది. ప్రచారం ముగిసిన తర్వాత వెంటనే జైలుకి వెళ్లిపోయారు. మిగతావారికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం ససేమిరా అంటోంది.

ఇక సీబీఐ నమోదు చేసిన కేసులో ఈనెల 21 వరకు ఎమ్మెల్సీ కవితకు రిమాండ్‌ విధించింది న్యాయస్థానం . ఈ కేసులో ఆమె పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను జులై ఆరున చేపడతామని స్పష్టం చేసింది న్యాయస్థానం.

మరోవైపు కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రెండు వారాలపాటు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. ఈనెల 21 వరకు ఆమె రిమాండ్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత మళ్లీ బెయిల్ పిటిషన్ వేసే పనిలో పడ్డారు ఆమె తరపు న్యాయవాది. మరోవైపు ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై మూడు వరకు ఉంది.

ALSO READ: గొర్రెల స్కాం 700కోట్లు.. రంగంలోకి ఈడీ

మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత తీహార్ జైలుకు తరలించారు. ఆమె జైల్లో ఉండగానే సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి సీబీఐ, ఈడీ అభ్యర్థన మేరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ వచ్చింది న్యాయస్థానం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News