Big Stories

KCR Distance with KTR: జాడలేని కేటీఆర్.. ఆ పదవి నుంచి తప్పించబోతున్నారా?

KTR Maintaining Distance to BRS Party Programs: ఆయన పదేళ్ల ప్రభుత్వంలో కీ పర్సన్.. ముఖ్యమంత్రికి తనయుడు.. అఫిషియల్ గా తండ్రి .. కానీ అన్ అఫిషీయల్ గా కొడుకే సీఎం.. పైగా అప్పుడు..ఇప్పుడు పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈ పాటికే మీకు అర్థమై పోయి ఉంటుంది. మనం మాట్లాడేది ఇప్పుడు కేటీఆర్‌ గురించి. ఆయన గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా?ఎందుకంటే కేటీఆర్‌ను సారు దూరం పెడుతున్నారా? లేక కేటీఆరే దూరంగా ఉంటున్నారా? బావ రాకతో బావమరిదిపై ఎఫెక్ట్‌ పడింది అనుకోవాలా? ఇంతకీ బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది.

- Advertisement -

బీఆర్ఎస్ లో ప్రక్షాళన మొదలైనట్టు కనిపిస్తోంది. మంత్రిగా పాలన చేసినన్ని రోజులు అహంకార భావంతో మెదిలారు. తానే రాజు తానే మంత్రి అనే విధంగా పాలన చేశారు. దీంతో కిందిస్థాయి ప్రజల్లో చాలావరకు మైనస్ అయ్యారు. చివరికి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను నేలకు కొట్టేశారు. లోక్‌సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటుదామనుకున్నారు. కానీ అది కూడా బెడిసికొట్టింది. మూలిగే నక్కపై తాటికాయ వచ్చి పడ్డట్టు తయారైంది బీఆరెస్ పరిస్థితి. అసలే అధికారం కోల్పోయి బాధలో ఉన్న ఆ పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు పార్టీని వీడుతాడో తెలియక కేసీఆర్ ఆందోళనకు గురి అవుతున్నారు.

- Advertisement -

అందుకే అందుబాటులో ఉన్న MLAతో వరుస మీటింగ్ లు నిర్వహిస్తున్నారు కేసీఆర్. అయితే ఆ మీటింగుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనాలి. నిన్న జరిగిన గ్రేటర్‌ ఎమ్మెల్యేల మీటింగ్‌లోనూ కేటీఆర్‌ కనిపించలేదు. కానీ ఆయన బదులు ఎమ్మెల్యే హరీశ్ రావు కనిపించారు. కీలకమైన పార్టీ సమావేశాలకు కేటీఆర్ దూరంగా ఉండటంపై చర్చ మొదలైంది. పార్టీలోనే కాదు. బయట కూడా దానిపై చర్చించుకుంటున్నారు. కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి ప్రచారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే ఉన్నాయి. ఇటీవల ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆ ప్రచారం మరింత విస్తృతమైంది. పైగా ఇప్పుడు ఫామ్ హౌజ్ మీటింగ్ లో కేటీఆర్ కనిపించకపోవడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది.

Also Read: Jagan alone in Bangalore : బెంగళూరులో ఒంటరిగా జగన్.. ఏం చేస్తున్నారు అక్కడ ?

వాస్తవానికి కేటీఆర్ కంటే ముందు నుంచి పార్టీలో ఉంది హరీశ్ రావు. పైగా కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ప్లేస్ లో కొనసాగారు. ఎప్పుడైతే కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారో.. అప్పుడు కేసీఆర్ చక్రం తిప్పారు. కుమారుని కోసం హరీశ్ రావును మెల్లగా సైడ్ చేశారు. అలా హరీశ్ రావును పక్కనపెట్టి కొడుకును అందలమెక్కించారు. ఇన్నేళ్లూ అధికారంలో ఉండగా కేసీఆర్, కేటీఆర్ రాజభోగాలు అనుభవించారు. హరీశ్ రావుకు ఏదో ఒక పదవి ఇస్తూ వచ్చారు. ఎప్పుడైతే పార్టీ సంక్షోభంలో పడిందో అప్పుడు కేసీఆర్ కు మళ్లీ హరీశ్ గుర్తుకువచ్చారు.

పార్టీని కాపాడుకుంటేనే మనకు లైఫ్ ఉంటుందని కేటీఆర్ తో కేసీఆర్ చెప్పారట. అందులోభాగంగానే కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పిస్తారట. పైగా కేసీఆర్ వయసు మీద పడుతున్నా కొద్దీ బయట ఎక్కువగా తిరగలేడు. ఏం చేసినా ఈలోగానే చేయాలి అన్నది కేసీఆర్ ప్లాన్. కొడుకు కోసం బంగారు భవిష్యత్ సెట్ చేయాలంటే ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గాలి. అందుకే హరీశ్ రావును మీటింగుల్లో కూర్చోబెట్టుకుని కొడుక్కు లేని ప్రియారిటీ అల్లునికి ఇస్తున్నారు కేసీఆర్.

Also Read: బ్రేకింగ్ న్యూస్.. అలక వీడిన జీవన్ రెడ్డి.. పార్టీనే ముఖ్యమంటూ వ్యాఖ్య

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని హరీశ్‌రావుకు ఇస్తే కేటీఆర్ ఒప్పుకుంటారా? తండ్రి స్కెచ్ ను కేటీఆర్ అర్థం చేసుకుని సైడ్ అవుతారా అన్నది ఇక్కడ ఆలోచించాలి. వాస్తవానికి పార్టీలో, పదేళ్ల ప్రభుత్వంలో హరీశ్ రావు ట్రబుల్ షూటర్ గా ఉన్నారు. ఆయనకు ఇస్తేనే జనాల్లో గుర్తింపు ఉంటుందని కేడర్ ఎప్పటినుంచో భావిస్తుంది. ఇన్నేళ్లు కొడుకు కోసం కేసీఆర్ హరీశ్ ను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అతన్ని దగ్గరకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి ఎందుకు తప్పిస్తారు?

అందుకు కారణం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు.. MLAలు వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే పరోక్ష కారణమట. తాను చెప్పిందే జరగాలి అనే పద్దతిలో కేటీఆర్ నడుచుకుంటారని MLAలు ఆగ్రహంతో ఉన్నారట. అలాంటివారే ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని ప్రచారంలో ఉంది. అయితే హరీశ్ రావుకు మాస్ లీడర్ గా పేరుంది. పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ కేటీఆర్ తర్వాతనే అన్నట్టుగా ఇన్నాళ్లూ సీన్ ఉంది. మరి ఇప్పుడు హరీశ్ రావు ఎంట్రీతో ఎవరికీ ప్లస్.. ఎవరికి మైనస్. అనేది పక్కనపెడితే.. ఈ సీన్ మొత్తాన్ని డైరెక్ట్ చేస్తున్నది కేసీఆర్ అన్నది అతికొద్ది మందికి మాత్రమే తెలుసు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News