Big Stories

Konda Surekha : టీపీసీసీ ఎ‍గ్జిక్యూటివ్‌ కమిటీకి కొండా సురేఖ రాజీనామా.. కారణమిదే..!

Konda Surekha : టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు తర్వాత ఆ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. టీపీసీసీ ఎ‍గ్జిక్యూటివ్‌ కమిటీకి మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ రాజీనామా చేశారు. టీపీసీసీ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో తనపేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

తనకంటే జూనియర్లకు పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో స్థానం కల్పించారని కొండా సురేఖ విమర్శించారు. ఈ చర్య తమను అవమానించడమే అవుతుందన్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీకే తనను పరిమితం చేయడం బాధించిందన్నారు . అందుకే రాజీనామా చేశానని కొండా సురేఖ ప్రకటించారు.

- Advertisement -

కొండా సురేఖ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నాయకురాలిగా ఉన్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కొంతకాలం వైఎస్ జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. మొత్తం 4 సార్లు సురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో 3 సార్లు కాంగ్రెస్ నుంచి ఒక పర్యాయం టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇప్పుడు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామ చేయడంతో ఇంకా ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా అనే దానిపైనా ఉత్కంఠ కొనసాగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News