Big Stories

Judicial Panel: నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంట్‌ను కాపాడుకోగలమా..? : కోదండరాం

Judicial Panel on Power Issues(TS today news): ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారంతోపాటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. బీఆర్కే భవన్ లో కమిషన్ కార్యాలయానికి మంగళవారం తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు వెళ్లారు. వీరి నుంచి కమిషన్ పలు వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం కోదండరాం, రఘు మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

‘గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలను గత పాలకులు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చట్టం ప్రకారం అందరం నడుచుకోవాలి. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలి. అభివృద్ధి అంటే ఒకరికో ఇద్దరికో లాభం చేయడం కాదు. గత ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్ కో, జెన్ కోలకు రూ. 81 వేల కోట్ల వరకు అప్పులయ్యాయి. భవిష్యత్ లో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంట్ ను కాపాడుకోలేని పరిస్థితి ఉంది. గతేడాది వచ్చినటువంటి వరదలకు భద్రాద్రి ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తప్పిదాలపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకాడొద్దు’ అంటూ కోదండరాం అన్నారు.

- Advertisement -

రఘు మాట్లాడుతూ.. ఛత్తీస్ గఢ్ తో 2000 మెగావాట్లకు ఒప్పందం చేసుకుంటే 200 మెగావాట్లు కూడా రాలేదన్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఎంఓయూ రూట్ ఎందుకు చేశారు? కాంపిటేటివ్ బిడ్డింగ్ కు ఎందుకు వెళ్లలేదు? కాంపిటేటివ్ బిడ్డింగ్ కు వెళ్లుంటే రేట్లు తగ్గేవి కదా అని రఘు పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ తో కరెంట్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లపై గతంలో అఫిడవిట్ వేశామన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కమిషన్ ముందు ఉంచామని ఆయన తెలిపారు.

Also Read: మేం పాలకులం కాదు సేవకులం: సీఎం రేవంత్ రెడ్డి

ఇదిలా ఉంటే.. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లతోపాటు ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారించేదుకు జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడీషియల్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి కేసీఆర్, అజయ్ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చారు. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జులై 30 వరకు సమయం అడిగారని కమిషన్ తెలిపిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News