Big Stories

KCR Meeting In Farm House: ప్లీజ్‌.. ఎవరూ పార్టీని వీడొద్దు.. ఇది ఆర్డర్ కాదు.. నా రిక్వెస్ట్..

Key comments of KCR addressing the MLAs who are changing the party: తొందరపడకండి.. అప్రమత్తంగా ఉండండి.. ఆశలకు లొంగకండి.. ఒత్తిడిలకు తలొగ్గకండి.. ఏం చేసినా మీరు పార్టీని వదలొద్దు. ఇది ఆర్డర్ కాదు.. నా రిక్వెస్ట్.. ప్లీజ్‌ ఎవరూ పార్టీని వీడొద్దు.. ప్రస్తుతం టైమ్‌ బాగాలేదు.. మళ్లీ మనకు మంచిరోజులొస్తాయి. ఇలా సాగుతోంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ స్పెషల్ క్లాస్‌లు.. మరి ఇంతా విన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?

- Advertisement -

అదండి సంగతి.. మంతనాలు పనిచేయడం లేదు. కేసీఆర్‌ స్వయంగా ఫోన్ చేసి పిలిచి బుజ్జగించినా కానీ ఎమ్మెల్యేలు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని ఈ సీన్‌తో అర్థమైపోతుంది. నిజానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఎప్పుడైతే గేట్లు ఓపెన్‌ చేశామని ప్రకటించారో.. అప్పుడే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. దీంతో కేసీఆర్ అలర్టయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగిపోకుండా ఉండేందుకు రాత్రి, పగలు కష్టపడుతున్నారు.  ఇందులో భాగంగానే కేసీఆర్ ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపుకూడా తట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ వేశారు.

- Advertisement -

నిజానికి కేసీఆర్ తీసుకున్న ఈ స్టెప్‌తో కాంగ్రెస్‌ పార్టీ మరింత అలర్టైంది. ఎందుకంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే అది మొదటికే మోసం.. అందుకే ఏకంగా బీఆర్ఎస్‌ఎల్పీ విలీనంపైనే దృష్టి సారించింది. అలా అయితేనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు.. కాబట్టి.. చేరికలను మరింత సులభతరం చేయనుంది. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వెళ్లింది కాంగ్రెస్.. దీనికి ఉదాహరణే కాలె యాదయ్య చేరిక.. నిజానికి ఆయన కంటే ముందు చేరిన ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌తో భేటీ కాలేదు. కానీ యాదయ్య చేరిక మాత్రం కొంచెం స్పెషల్.. కేసీఆర్‌ బుజ్జగింపులు, ఫామ్‌హౌస్‌లో మంతనాల అనంతరం కూడా ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అంటే ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌ను పట్టించుకునే పరిస్థితి లేదని దీన్ని బట్టే అర్థమవుతోంది.

మరి మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితేంటి? వారైనా పార్టీలో ఉంటారా? ఉండరా? ఇదే ప్రశ్న ఇప్పుడు కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ పెద్దలను సతమతం చేస్తోంది. ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 39.. అందులో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌ గెలిచింది. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 38కు పడిపోయింది. ఇందులో ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాబట్టి.. ఇక మిగిలింది 32 మంది. వీరిలో మరో 13 మంది వరకు కాంగ్రెస్‌తో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. మిగతా వారితో కూడా టచ్‌లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. అయితే కొందరు కాంగ్రెస్‌వైపు చూస్తుండగా.. మరికొందరు మాత్రం బీజేపీవైపు చూస్తున్నారని తెలుస్తోంది. మరి పార్టీలో చివరికి మిగిలేది ఎంతమంది అనేది ఇప్పుడు కాస్త మిస్టరీగా మారింది.

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అప్రూవర్ గా కవిత?

ఒకరు పోతే పది మందిని తయారు చేసుకుంటామని కేసీఆర్ ప్రస్తుతం మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ రోజురోజుకు కేసీఆర్ ఊబిలో కూరుకుపోతున్నారనే విషయాన్ని గమనించినట్టుగా లేదు. ఓ వైపు కేసులు.. మరోవైపు కమిషన్‌లు.. మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు.. క్యాడర్‌లో తగ్గుతున్న మనోస్థైర్యం.. ప్రజల్లో పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి నిలబెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి.. మొత్తంగా చూస్తే కేసీఆర్‌ పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా మారింది.

అయితే కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఒకమాట అన్నారన్న విషయం బయటికి వచ్చింది. మధ్యలో వచ్చినొళ్లు మధ్యలోనే పోతారని.. అప్పటి టీఆర్ఎస్‌.. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్లేంత మంది. అసలైన నేతలను, ఉద్యమకారులను పక్కన పెట్టి.. మధ్యలో వచ్చిన నేతలను అప్పుడు నెత్తిన పెట్టుకున్నది ఎవరు? ఈ మాట మీరు చెప్పేటప్పుడు.. మీ ముందు కూర్చున్న ఎమ్మెల్యేలలో ముందు నుంచి మీ పార్టీలో ఉన్నారు? అందులో కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరారు? కనీసం ఈ విషయాలనైనా దృష్టిలో ఉంచుకోని మాట్లాడాలి కదా అనే టాక్‌ వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్స్‌లో.. అంతేకాదు కాంగ్రెస్‌లో చేరికలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. బుజ్జగించడం.. బెదిరించడం లాంటివి చేసినప్పుడైనా.. గతంలో ఇవే పనులు చేసినప్పుడు ఇతర పార్టీల పెద్దలు ఎలా ఫీలయ్యారో ఇప్పుడైనా అర్థమైందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే అంటారు.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చేసిన కర్మకు ఫలితం అనుభవించక మానదని.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News