Big Stories

KCRs Writ petition: మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్

High Court Hears KCR’s Writ petition(Political news in telangana): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టంది. ఇందులో భాగంగా కోర్టులో వాదనలు ముగిశాయి. కేసీఆర్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే విద్యుత్ రంగ నిర్ణయాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది. అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఆ కమిషన్‌ను రద్దు చేయాలని, విచారణకు హాజరుకావాలంటూ తనకు దాఖలైన నోటీసులను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన ఈ పిటిషన్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి.

- Advertisement -

విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫున న్యాయవాది వాదించారు. కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదిత్య సొందీ, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.

కేసీఆర్ పిటిషన్‌పై గురు, శుక్రవారాల్లో కోర్టులో వాదనలు జరిగాయి. శుక్రవారం సైతం విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు పేర్కొంది. నేడు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని జడ్జి తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, రెండు థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై వివరణ, సమాచారం ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్‌కే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో కమిషన్ కార్యాలయానికి కేసీఆర్ వచ్చి వివరణ ఇవ్వాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అయితే ఈ లేఖకు కేసీఆర్ వివరణ ఇచ్చారు. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని, విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ జస్టిస్ నరసింహారెడ్డికి ప్రత్యుత్తరం పంపారు.

నోటీసులో ఏముందంటే?
ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి కాంట్రాక్టుల అప్పగింతపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత 28 మంది అధికారులు, బాధ్యుల వివరణలు ఇవ్వాలని గతంలో కమిషన్ లేఖలు రాసింది. వీటికి అందరూ సమాధానాలిచ్చారు. అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పంపుతున్నట్లు కేసీఆర్‌కు నోటీసు పంపించారు. మీ వాదనకు సంబంధించిన ఏ సమాచారమైనా కమిషన్‌కు సమర్పించేందుకు అవకాశమిస్తున్నామని పేర్కొంది.

Also Read: రవాణాశాఖ అధికారుల పెన్‌డౌన్‌..నల్ల రిబ్బన్లతో నిరసన

అదే విధంగా కమిషన్‌కు సమాచారం ఇచ్చిన సాక్షులను విచారణ చేయాలనుకుంటే అవకాశం ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని కోరుతున్నట్లు నోటీసులో వివరించింది. అయితే ఈ గడువు మంగళవారంతో పూర్తయింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్.. హైకోర్టులో పిటిషన్ వేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News