Big Stories

KCR : హైదరాబాద్ లో భారత్‌ భవన్‌ నిర్మాణం.. నేడు శంకుస్థాపన ..

- Advertisement -

KCR latest news telugu(Today breaking news in Telangana) : ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బీఆర్ఎస్ నిర్మించింది. మహారాష్ట్ర, ఏపీలోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభించింది. ఇప్పుడు హైదరాబాద్‌లో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ భవనంలో పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ కార్యకర్తలకు రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. నాయకులకు అవసరమైన సమగ్రమైన సమాచారం లభించే ఏర్పాట్లు చేస్తారు.

- Advertisement -

ఈ భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్‌ నగర శివారులోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తారు. మొత్తం 15 అంతస్థుల్లో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. భవన డిజైన్లు, నిర్మాణంపై కేసీఆర్‌ త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

సమస్త సమాచారం లభించే కేంద్రంగా ఈ భవనాన్ని తీర్చిదిద్దనున్నారు. సమావేశ మందిరాలు, అత్యాధునిక డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తారు. పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలను ఏర్పాటు చేస్తారు.

శిక్షణకు వచ్చేవారు బస చేసేందుకు వసతి ఏర్పాట్లు చేస్తారు. దేశంలోని ప్రముఖ సంస్థల్లో పనిచేసిన కొందరు సీనియర్లను శిక్షణ, పరిశోధన కార్యక్రమాల కోసం నియమిస్తారు. రిటైర్డ్‌ అధికారులు, న్యాయనిపుణులు, రాజకీయ రంగంపై అవగాహన ఉన్నవారిని సమన్వయకర్తలు, శిక్షకులు, సబ్జెక్ట్‌ నిపుణులుగా నియమిస్తారు. శంకుస్థాపన కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు, మంత్రులు, హైదరాబాద్‌ నగర ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు పంపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News