EPAPER

KCR: కేసీఆర్ మారిపోయారా? మంచోడైపోయారా? ఏంటి సంగతి?

KCR: కేసీఆర్ మారిపోయారా? మంచోడైపోయారా? ఏంటి సంగతి?

KCR: సీఎం కేసీఆర్. ఈ పేరు చెబితే మిక్స్డ్ టాక్ వినిపిస్తుంటుంది. కొందరేమో ఆయన మా దేవుడు, తెలంగాణ జాతిపిత, సమర్థుడైన ముఖ్యమంత్రి అంటూ పొగడ్తలతో ముంచేస్తారు. ఇంకె సెక్షన్ అయితే కేసీఆర్ వేస్ట్, కేసీఆర్ ది దొరల పాలన, రాష్ట్రాన్ని ఆగం చేశాడు, అప్పుల పాటు చేశాడు.. అది ఇవ్వలేదు, ఇది చేయలేదు.. అంటూ పెద్ద లిస్టే చెబుతారు. ఎవరి వాదన వారిదే. కేసీఆర్ మంచోడా? చెడ్డోడా? అని చెప్పడం కష్టమే.


ముఖ్యమంత్రిలో ఈమధ్య సడెన్ ఛేంజ్ కనిపిస్తోంది. ఏళ్లుగా పట్టించుకోని పనులను వరుసగా చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్ గా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు. కేసీఆర్ ఏంటి? డీఏ ఏంటి ఇవ్వడం ఏంటి? అంటూ కొందరు షాక్ అవుతున్నారు. అయితే, నాలుగు డీఏలు పెండింగ్ లో ఉంటే.. ఒకే ఒక్క డీఏ ఇచ్చి తమకు బిస్కెట్ వేయడమేంటని ఉద్యోగులు మండిపడుతున్నారు.

డీఏ కంటే ముందే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అవాక్కయ్యేలా చేశారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను ఇప్పుడు తీర్చబోతున్నారు. షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. అయితే, ఆ క్రెడిట్ కేసీఆర్ కు రాకుండా 317 జీవో బాధితులు, స్పౌజ్ కేటగిరీ బదిలీల డిమాండ్ దారుల ధర్నాలు, ఆందోళనలతో ఉద్రిక్తత రాజేస్తున్నారు.


సీఎం కేసీఆర్ కు ఉన్నట్టుండి ప్రభుత్వ ఉద్యోగులపై అంత ప్రేమ ఎందుకొచ్చిందనేదే ఆసక్తికర విషయం. లాభం లేనిదే ఏదీ చేయని కేసీఆర్.. ఊరికే చేయరు ఇలాంటి పనులు అంటున్నారు. ప్రభుత్వంపై రగిలిపోతున్న ఉద్యోగులను.. ఎన్నికల ముందు కూల్ చేసేందుకే ఈ తాయిలాలనే చర్చ జరుగుతోంది.

ఇది ఎన్నికల సీజన్. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఎలక్షన్ జరగాల్సి ఉంది. ముందస్తుకు వెళితే ఇంకా ముందే వచ్చేస్తుంది. నాలుగేళ్లుగా ఉద్యోగులు తనను ఏమనుకున్నా పర్వాలేదు.. ఇప్పుడు కనుక వారి కోరికలు కొన్ని తీర్చితే.. ఎన్నికల సమయంలో కీ రోల్ ప్లే చేసే ఉద్యోగులతో ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందనేది కేసీఆర్ లెక్క అంటున్నారు.

తమ మాటలతో ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసే సత్తా ఉన్న ప్రభుత్వ టీచర్లు, మిగతా ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలనే విషయం అందరికంటే గులాబీ బాస్ కే ఎక్కువ తెలుసు. అందుకే, భారీగా డీఏలు బాకీ ఉన్నా.. ఖజానాపై భారం పడకుండా ఏదో ఇచ్చామంటే ఇచ్చామనేలా ఓ డీఏ ఇస్తున్నారు. 317 జీవో, స్పౌజ్ కేటగిరీ బాధితులు కొందరు ఉన్నా.. మిగతా లక్షలాది మంది ఉద్యోగులు తాజా బదిలీలు, ప్రమోషన్లతో ప్రభుత్వంపై సాఫ్ట్ కార్నర్ కు వస్తారనేది కేసీఆర్ అంచనాగా తెలుస్తోంది. ఇదంతా సీఎం కేసీఆర్ ఎన్నికల స్టెంట్ అనే మాట వినిపిస్తోంది. మరోవైపు, కొత్త సచివాలయ ప్రారంభోత్సవం, అమరవీరుల స్మారకం, కంటి వెలుగు పథకం.. ఇవన్నీ కూడా ఎలక్షన్ సిగ్నల్సే అంటున్నారు. మరి, ఆ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమా? ముందస్తా?

TS: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త

TS: టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల.. ఉద్యోగులకు డీఏ పెంపు..

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×