Big Stories

KCR: కేసీఆర్ సార్.. మర్చిపోయారా? ఇప్పుడు మీరు సీఎం కాదు

- Advertisement -

ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర ప్లాంట్ నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. నిజానిజాలు తేల్చడానికి జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలో ఓ కమిషన్ ను కూడా నియమించింది. గత ప్రభుత్వం టెండర్లు లేకుండా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఓ సంస్థకు అప్పగించిందని ఈ కమిషన్ విచారణలో తేలింది. అంతేకాదు.. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం దగ్గర విద్యుత్‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేసిందని తేల్చింది. అయితే.. ఎందుకు అలా కొనాల్సి వచ్చింది? పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎందుకు టెండర్లు పిలవలేదని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ ను ప్రశ్నించింది.

- Advertisement -

దీనిపై ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని వారం రోజుల క్రితం ఆదేశించింది. వివరణ ఇస్తారా? ఇవ్వరా? అనే ఉత్కంఠను క్రియేట్ చేసిన కేసీఆర్.. చివరి నిమిషంలో విద్యుత్ కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు. ఇందులో వివరణ కంటే.. కమిషన్ పనితీరుపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. విభజన తర్వాత చీకట్లో ఉన్న తెలంగాణకు తాను వెలుగులు తీసుకొచ్చానని కేసీఆర్ ఆ లేఖలో చెప్పారు. దాని కోసం ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సి వచ్చిందని అన్నారు. ఇక్కడ వరకూ కేసీఆర్ వివరణపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు.

తప్పో, ఒప్పో అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారని అనుకోవచ్చు. కానీ, ఆ తర్వాత ఆయన రాసుకొచ్చిన విషయాలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయి. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి పని తీరుపై ఆయన విమర్శలు చేశారు. ఈ కమిషన్ తనకు వ్యతిరేకంగా ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. నిజానిజాలు తేల్చడానికే కమిషన్ ఉండాలే తప్పా.. తనను దోషిగా చూపించడానికి కాదని విమర్శించారు. కానీ, తనదే తప్పని నిరూపించడానికే ఈ కమిషన్ పని చేస్తుందని మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా కమిషన్ చైర్మన్‌గా ఉండే అర్హత జస్టిస్ నరసింహారెడ్డికి లేదని.. కమిషన్ నుంచి తప్పుకోవాలని.. విచారణ ఆపేయాలని కేసీఆర్ ఉచిత సలహా ఇచ్చారు.

Also Read: చిక్కుల్లో పొన్నవోలు, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసులకు ఫిర్యాదు..

కేసీఆర్ తీరు అన్ని రాజకీయ పార్టీలు ఖండించేలా ఉంది. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వడం మాత్రమే కేసీఆర్ బాధ్యత. కానీ, ఆయన ఈ కమిషన్‌ని ప్రశ్నించే, తప్పు పట్టే రైట్ ఆయనకు లేదు. ఆయన తప్పు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ మర్చిపోయి.. కమిషన్‌ను తానే ఏర్పాటు చేశానని ఆయన భ్రమపడుతున్నట్టు ఉన్నారు. అలా భ్రమలో ఉంటేనే ఇలా కమిషన్‌కు, చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేస్తారు. వివరణ ఇవ్వాల్సింది పోయి.. ఆదేశాలు ఇవ్వడమేంటని అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్నికల్లో రెండు సార్లు వరుస దెబ్బలు తగిలినా.. తీరు మారకపోతే బీఆర్ఎస్ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా లోక్‌సభ ఎన్నికల్లో  బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలే పోయింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడు విజయం మరోసారి వరిస్తుంది. కానీ.. ఓటమిని, ప్రతిపక్షంలో ఉన్నామన్న నిజాన్ని అంగీకరించ లేకపోతే రాజకీయ భవిష్యత్ సమాధి అవుతుంది. ఈ విషయాన్ని కేసీఆర్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News