Big Stories

KCR Petition to High Court: హైకోర్టులో కేసీఆర్ పిటిషన్.. తెలంగాణ విద్యుత్ కమిషన్‌ రద్దు చేయాలంటూ..

KCR Petition to High Court: తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గత ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ నియ మించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

నిబంధనల మేరకు విద్యుత్ కొనుగోలు జరిగిందని ప్రస్తావించారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఏక పక్షంగా వ్యవహరస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో విద్యుత్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారాయన. ఎలక్ట్రిసిటీ రెగ్యులటరీ కమిషన్ ఆదేశాల మేరకు విద్యుత్ కోనుగోలు చేశామని, దీనిపై న్యాయస్థానం బుధవారం (రేపు) విచారణ చేపట్టే అవకాశముంది.

- Advertisement -

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ నిర్మాణాల్లో భారీ అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణాలపై లోటుపాట్లను తేల్చాలని ఆదేశించింది.

Also Read: రైలు రోకో కేసు.. కేసీఆర్‌కు స్వల్ప ఊరట, కాకపోతే..

ఇందులోభాగంగా ఆయా నిర్ణయాలపై వివరణ ఇవ్వాలంటూ ఈ నెల 11న కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జులై 30 వరకు సమయం కావాలని కోరారు కేసీఆర్. అందుకు కమిషన్ అంగీకరించలేదు. ఈ క్రమంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు 12 పేజీలతో కూడిన లేఖ రాశారు కేసీఆర్.

తమ హయాంలో 24 గంటల విద్యుత్ అందించాలని, విద్యుత్ సరఫరా విషయంలో గణనీయమైన మార్పుల్ని చూపించామన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కమిషన్ చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను అప్రతిష్టపాలు చేయాలన్న దురుద్దేశంతోనే కమిషన్ ఏర్పాటు చేసిందని, దీని బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేసీఆర్ కోరారు.

Also Read: TG Government: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. నిధులు విడుదల చేస్తూ జీఓ

జూన్ 15 లోగా సమాధానమివ్వాలని భావించినప్పటికీ, దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని అర్థమైందన్నారు కేసీఆర్. విచారణ పూర్తికాకుండానే ప్రెస్ మీట్ పెట్టి.. తన పేరును ప్రస్తావించారని, తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్నదే కమిషన్ ఉద్దేశమైనపుడు హాజరైనా ప్రయోజనం ఉండదని అర్థమైందన్నారు. విచారణ తీరు సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా ఉందన్నారు కేసీఆర్. ఈ క్రమంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మరి న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం చెబుతుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News