Big Stories

Will KCR attends Modi’s Swearing: మోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్తారా..? వెళ్తే..?

KCR Invited to Modi’s Swearing: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదివారం ఢిల్లీ వెళ్తున్నారా? ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారా? లేక ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారా? కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే ఒక సమస్య, వెళ్లకుంటే మరో చిక్కు. ఇప్పుడు ఎటూ తేల్చుకోని పరిస్థితి గులాబీ బాస్‌ది.

- Advertisement -

కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు ఇన్విటేషన్లను పంపారు. అలాగే భారతదేశం పొరుగు దేశాల అధినేతలు హాజరు కానున్నారు. అన్నింటి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్ అధినేత గురించి. మోదీ ప్రమాణ స్వీకారానికి రావాలని బీజేపీ హైకమాండ్ నుంచి కేసీఆర్‌కు ఫోన్ వచ్చింది. ఇంతకీ మోదీ కార్యక్రమానికి ఆయన వెళ్తారా? అన్నదే అసలు పాయింట్.

- Advertisement -

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత లోక్‌సభ లో ఆ పార్టీకి నేతలు ఎవరులేరు. ఈ పరిస్థితి ముమ్మాటికీ కేసీఆర్ కారణమని అంటున్నారు. ఎన్నికల తర్వాత అధికార కాంగ్రెస్, ఎంఐఎం సైతం కారు పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించారు. బీజేపీతో అంతర్గత ఒప్పందం కారణంగా ఆ పార్టీ అన్ని సీట్లను గెలిచిందని ఓపెన్‌గా చెప్పేశారు. ముఖ్యంగా కారు పార్టీకి బలమైన మెదక్‌లో సైతం బీజేపీ గెలవడంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

Also Read: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

మోదీ కార్యక్రమానికి కేసీఆర్ ఒకవేళ వెళ్తే ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత డీల్ బయటపడుతుందని అంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కేంద్రంలో తానే చక్రం తిప్పుతానని ఓపెన్‌గా చెప్పిన కేసీఆర్, మరి అక్కడికి వెళ్తారా? అన్నదే అసలు ప్రశ్న. వెళ్లకపోతే కనీసం కేటీఆర్‌ని పంపే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ పెద్దలు ఎటూ తేల్చేకోలేక పోతున్నారట.

ఒకవేళ వెళ్తే టీడీపీ అధినేత, కాబోయే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అక్కడే ఉంటారు. కేంద్రంలో మోదీ మూడోసారి పగ్గాలు చేపడుతున్నారంటే అందుకు టీడీపీయే కారణం. ఎన్డీయే మిత్రులను అక్కడి పెద్దలు రిసీవ్ చేసుకునే విధానం వేరేగా ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లి ఇబ్బందులు తెచ్చుకునే బదులు కేటీఆర్‌ని బాగుంటుందని గులాబీ బాస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నమాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News