Big Stories

Kavitha Judicial Custody : తీహార్ జైలుకే కవిత పరిమితం.. 25 వరకూ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Kavitha and Sisodia Judicial Custody news(Telangana News): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీని జూలై 25 వరకూ పొడిగిస్తూ.. ఢిల్లా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె మళ్లీ తీహార్ జైలుకే పరిమితం అయ్యారు. ఈడీ కేసులో కవిత కస్టడీ నేటితో ముగియడంతో.. అధికారులు వర్చువల్ గా కోర్టులో హాజరు పరిచారు. ఈడీ వాదనలు విన్న న్యాయమూర్తి ఆమె కస్టడీని పొడిగిస్తూ.. తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేశారు. కవితతో పాటు మనీశ్ సిసోడియా కస్టడీని కూడా పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

- Advertisement -

లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్టైన కవిత.. మూడు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కవిత తర్వాత అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యలో బెయిల్ మంజూరవ్వగా.. ఆ గడువు పూర్తవ్వడంతో మళ్లీ తీహార్ జైలుకు వెళ్లారు. కవిత ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసినా.. దానికి అనుకూలంగా కోర్టు నుంచి తీర్పు రావడం లేదు. కవిత బెయిల్ పై విడుదలవుతారని ఎదురుచూసిన ప్రతీసారి కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశే ఎదురవుతోంది.

- Advertisement -

Also Read : ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవిత అప్రూవర్‌గా మారే ఛాన్స్?

సీబీఐ కేసులో జూన్ 21న కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియగా.. జూలై 7వరకూ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ కవితను తీహార్ జైల్లో అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీని అనుకూలంగా మార్చుకునేందుకు రూ.100 కోట్లను సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ కు ఇచ్చారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఒక పక్క ఈడీ, మరోపక్క సీబీఐ కేసుల్లో కవితకు జ్యుడీషియల్ కస్టడీ గడువులు పెరుగుతున్నాయే తప్ప బెయిల్ లభించడం లేదు.

ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను జూలై 1న ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవితకు షాక్ తగిలింది. సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు.. కవితకు బెయిల్ మంజూరు చేయడం కుదరదని తేల్చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

కవిత ఈ కేసులో అరెస్టైనప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ ఆమెను చూడలేదు. సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడారు. తల్లి శోభ కూడా కూతురిని చూసొచ్చారు. కానీ.. కేసీఆర్ మాత్రం ఇంతవరకూ కవిత కోసం వెళ్లలేదు. ఆమె గురించి పెద్దగా మాట్లాడలేదు కూడా. బీజేపీ తమపై కక్షసాధింపు చర్యలో భాగంగానే కవితను అరెస్ట్ చేయించిందని ఒకేఒక్కసారి వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇంతవరకూ ఆమె ప్రస్తావనే లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News