Big Stories

Kavitha Maybe Approver in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవిత అప్రూవర్‌గా మారే ఛాన్స్?

Kavitha Maybe Approver in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకుంటుందా? తీహార్ జైలు నుంచి కవిత విడుదల కానున్నారా? తెర వెనుక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. లిక్కర్ కేసులో అసలేం జరుగుతోంది?

- Advertisement -

ఇంతకీ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఏమన్నారు. శనివారం హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలు కవిత అప్రూవర్‌గా మారే ఛాన్స్ ఉందన్నారాయన. ఈ విషయంలో ఆమెకు నచ్చజెప్పేందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీహార్ జైల్లో కవితను కలిశారని గుర్తు చేశారు. ఈ లెక్కన తెరవెనుక ఏదో జరుగుతుందని చెప్పకనే చెప్పేశారాయన.

- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచి బీఆర్ఎస్ అగ్రనేతలు చేస్తున్న వ్యాఖ్యలు అందుకు అనుగుణంగానే ఉన్నాయి. త్వరలో రేవంత్‌రెడ్డి కూలిపోతుందని బీఆర్ఎస్ అగ్రనేతలు స్వయంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అంతర్గతంగా మద్దతు ఇచ్చింది కారు పార్టీ. అందుకే ఆ పార్టీకి ఓట్ల శాతం తగ్గి, బీజేపీకి పెరిగిందని నేతలు బహిరంగంగా చెప్పారు. అంతేకాదు ఇదే విషయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం ఓపెన్‌గా వెల్లడించారు.

శుక్రవారం ఢిల్లీ వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. తీహార్ జైలులో ఉన్న కవితను ములాఖత్ సమయంలో కలిశారాయన.  ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది టాప్ సీక్రెట్. కాకపోతే బీఆర్ఎస్ నేతలు మరో పది రోజుల్లో కవిత జైలు నుంచి బయటకు రావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ లెక్కన బీజేపీతో అంతర్గత ఒప్పందం జరిగిందనేది కాంగ్రెస్ నేతలు బలంగా చెబుతున్నమాట.

ALSO READ:  ప్లీజ్‌.. ఎవరూ పార్టీని వీడొద్దు.. ఇది ఆర్డర్ కాదు.. నా రిక్వెస్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు చాలామంది బయటపడ్డారు. శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, దినోష్ అరోరాలు అవ్రూవర్‌గా మారిన తర్వాతే న్యాయస్థానం వాళ్లకి బెయిల్ మంజూరు చేసింది.
ఈ జాబితాలోకి కవిత కూడా చేరుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసులో రానున్న రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News