Big Stories

Kavitha judicial custody extend: కవితకు నో రిలీఫ్, జులై మూడు వరకు.. అన్ని రోజులా..

Kavitha judicial custody extend: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు ఎమ్మెల్సీ కవితకు కష్టాలు తప్పలేదు. జ్యుడీషియల్ కస్టడీ నుంచి విముక్తి కల్పించాలని పలుమార్లు విన్నవించినా న్యాయస్థానం అందుకు ససేమిరా అంటోంది. తాజాగా ఆమె జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి  పొడిగించింది. ఈడీ కేసులో జులై మూడు వరకు కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.

- Advertisement -

ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా ముందు వాదనలను వినిపించారు కవిత తరపు న్యాయవాది నితీష్‌రాణా. ఆ తర్వాత ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపించారు. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఇందులో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్థారించామని, మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందన్నారు. ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారని తెలిపారు.

- Advertisement -

ఈ క్రమంలో కవిత జ్యుడీషియల్ కస్టడీని మరి కొంతకాలం పొడిగించాలని వాదించారు. ఈడీ తరపు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. చివరకు నెలరోజులపాటు కస్టడీ విధించినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టు హాలులో ఉన్న కవిత భర్త షాకయ్యారు. 30 రోజులు జ్యుడీషియల్ కస్టడీ అంటే చాలా ఎక్కువని అన్నారు.

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కవితపై రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి సీబీఐ కేసు. మరొకటి మనీలాండరింగ్ కేసులో 30 రోజులు కస్టడీ విధించింది. ఇప్పటివరకు ఏడేసి రోజులు మాత్రమే పొడిగిస్తూ వచ్చింది న్యాయస్థానం. దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. అలాగే సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరిగింది. జూన్ 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే రోజు ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది.

ప్రస్తుతం తీహార్ జైలులోని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఆమె కస్టడీ పొడిగింపుపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. కవితతోపాటు చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జీషీట్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో వారికి ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను జూన్ మూడున న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఆదేశించింది. కవితతోపాటు వారు కూడా హాజరుకానున్నారు.

ALSO READ: టోల్ ఛార్జీల పెంపు, ఎన్నికల తర్వాత బాదుడు.. అన్నింటా ధరలు పెరడం ఖాయం!

ఈ కేసులో ఛార్జిషీటు పరిగణనలోకి తీసుకున్న తర్వాత తొలిసారి న్యాయస్థానానికి కవిత హాజరయ్యారు. అయితే కవిత కస్టడీ మరో 15 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరుతున్నాయి. ఈ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో కవితను ఆమె ఇంట్లోనే అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. తీహార్ జైలులో ఉండగానే ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News