EPAPER

Kavitha : కవిత అభ్యర్థన తిరస్కారం.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Kavitha : కవిత అభ్యర్థన తిరస్కారం.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. మార్చి 16న ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ నెల 20న మళ్లీ విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఇప్పటికే తాను ఈడీ విచారణపై దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరారు. అయితే ఆమె అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతంలో చెప్పిన ప్రకారం ఈ నెల 24వ తేదీనే ఆ పిటిషన్ ను విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


మార్చి 20న తమ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని కవితకు గురువారం ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణ జరిగేంత వరకు ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైను గురువారం ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టిన ఈడీ ఆయనను కవితతో కలిపి ముఖాముఖి ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. దీంతో ప్రత్యేక న్యాయస్థానం రామచంద్ర పిళ్లై కస్టడీని మార్చి 20 వరకు పొడిగించింది. మార్చి 20న ఉదయమే కవిత-అరుణ్‌ పిళ్లైను ఎదురెదురుగా కూర్చోబెట్టి వాస్తవాలు రాబట్టుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. ఒకవేళ కవిత విచారణ రాకపోతే ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

TSPSC: పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసన.. బండి సంజయ్ అరెస్ట్


Military employees:-సైనికులను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు..

Related News

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Big Stories

×