Big Stories

Justice Narasimha Reddy: కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు..

Justice Narasimha Reddy comments: గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోలు విషయంలో తెలంగాణలో రోజురోజుకు రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతోపాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్.. తిరిగి కమిషన్ కు 12 పేజీలతో కూడిన లేఖను పంపించారు. కేసీఆర్ లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

కేసీఆర్ పంపినటువంటి లేఖ అందిందని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ‘ఛత్తీస్ గఢ్ పవర్ పర్చేజ్ తోపాటు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల గురించి పలు ప్రశ్నలకు లేఖలో కేసీఆర్ సమాధానమిచ్చారు. కేసీఆర్ చెప్పిన అంశాలను పరిశీలిస్తున్నాము. ఇందుకు సంబంధించి నిపుణుల కమిటీతో చర్చిస్తాం. కేసీఆర్ చెప్పిన వివరాలను వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉంది. వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతాం. కేసీఆర్ అభ్యంతరాలపై పునపరిశీలన చేస్తాం. ఎల్లుండి సమీక్ష జరుపుతాం. ఆ సమీక్షలో తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయాల్లో జరిగిన పరిణామాలను మాత్రమే మీడియాకు వివరించాం’ అంటూ జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. (వీడియో)

ఇదిలా ఉంటే.. రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశారంటూ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ విషయంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామన్నారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందజేశామని పేర్కొన్నారు. ఎంక్వైయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నరసింహారెడ్డికి కేసీఆర్ సూచిండం గమనార్హం. అదేవిధంగా.. ఈ విషయంలో విచారణ నిష్పక్షపాతంగా జరగడంలేదంటూ కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News