BigTV English

BRS: కారులో ఓవర్ లోడింగ్.. కాంగ్రెస్ లో పూనకాలు లోడింగ్..

BRS: కారులో ఓవర్ లోడింగ్.. కాంగ్రెస్ లో పూనకాలు లోడింగ్..
kcr revanth reddy

BRS party latest news(Today breaking news in Telangana): కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హస్తం గూటిలో చేరడం కన్ఫామ్ అయిపోయింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌ను వీడుతారనే ప్రచారం సాగుతోంది.


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. పట్నం ఫ్యామిలీ హవా జోరుగా ఉంది. ఆయన సతీమణి పట్నం సునీతా రెడ్డి.. ఇదివరకు రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా చేశారు. సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి.. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో తనకు తాండూరు టికెట్.. తన సతీమణికి చేవెళ్ల ఎంపీ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు మహేందర్‌రెడ్డి. అయితే, గులాబీ బాస్ మాత్రం పైలెట్ వైపే మొగ్గు చూపుతుండటంతో.. పట్నం కాంగ్రెస్ బాట పట్టనున్నారని ప్రచారం జరుగుతోంది.

కారు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదంటూ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా గులాబీ పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, మల్లు రవితో చర్చించారు. ఈనెల 22న పొంగులేటి, జూపల్లిలతో కలిసి దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డిలు.. రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరడం ఇక లాంఛనమే అంటున్నారు. కొడంగల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఇంటికెళ్లి మరీ రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు.


గ్రేటర్ హైదరాబాద్ గులాబీ పార్టీలోనూ నేతల మధ్య టికెట్ వార్ కొనసాగుతోంది. ఖైరతాబాద్ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు, ఇటీవలే బీఆర్ఎస్‌లో చేరిన దాసోజు శ్రవణ్‌కు పోటీ పెరిగింది. దానంకు టికెట్ రాకపోతే.. ఆయన తిరిగి తన సొంతగూటికి చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ తరఫున కర్చీఫ్ వేసుకున్నారు. మరి, దానం వస్తానంటే.. విజయారెడ్డిని కాదని కాంగ్రెస్ టికెట్ దక్కుతుందా అనేది డౌట్.

మహేశ్వరం నియోజకవర్గం రాజకీయం కూడా రసవత్తరంగా మారుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తీగల కృష్ణారెడ్డిల మధ్య టికెట్ పోరు సాగుతోంది. తనకు కానీ, తన కోడలు అనితారెడ్డికి కానీ టికెట్ గ్యారెంటీ ఇస్తే.. కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారు కృష్ణారెడ్డి.

మానకొండూరులోనూ సేమ్ సీన్. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కే మరోసారి ఛాన్స్ రావొచ్చు. అక్కడ టికెట్ కోసం ఆశగా చూస్తున్నా.. ఆరేపల్లి మోహన్ పార్టీని వీడుతారని.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నూతనొత్తేజం వచ్చింది. గతంలో కాంగ్రెస్ ను వీడిన వారంతా తిరిగి సొంత గూటికి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఘర్ వాపసీతో ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలం, బలగం భారీగా పెరుగుతుందని అంటున్నారు. తాజా పరిణామాలు కేసీఆర్‌కు ఇబ్బందికరమే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×