Big Stories

IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ..

IPS Transfers in Telangana: తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతుంది. శనివారం 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

నల్గొండ ఎస్పీగా ఉన్న చందనా దీప్తి సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ అయ్యారు. తన స్థానంలోకి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్ వచ్చారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీ సాయి చైతన్య బదిలీ అయ్యారు.

- Advertisement -

డీసీపీ రామగుండం గా విధులు నిర్వహిస్తోన్న అశోక్ కుమార్ జగిత్యాల ఎస్పీగా బదిలీ అయ్యారు. సన్‌ప్రీత్ సింగ్ సూర్యాపేట ఎస్పీగా, రాహుల్ హెగ్డే ట్రాఫిక్ డీసీపీగా, టీ శ్రీనివాస రావు జోగులాంబ గద్వాల ఎస్పీగా, డీ వీ శ్రీనివాస రావు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు.

మహబూబ్‌నగర్ ఎస్పీగా జానకి ధరావత్, సీఐడీ ఎస్పీగా విశ్వజిత్, శంషాబాద్ డీసీపీగా రాజేశ్, మేడ్చల్ డీసీపీగా కోటిరెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా, వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీగా రాజమహేంద్రనాయక్, మంచిర్యాల ఎస్పీగా భాస్కర్ బదిలీ అయ్యారు.

Also Read:  తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

డీసీపీ బాలనగర్‌గా సురేశ్ కుమార్, సైబర్ సెక్యూరిటీ ఎస్పీగా హర్షవర్ధన్, వికారాబాద్ ఎస్పీగా నారాయణ రెడ్డి ఆదిలాబాదం కమాండెంట్‌గా నికితా పంత్ బదిలీ అయ్యారు.

ఛటర్జీ, ఎల్ సుబ్బరాయుడులను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News