Big Stories

CM Revanth Reddy: నేను కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy on Government School: హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతిలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. మట్టిలో మాణిక్యాలుగా రాణిస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువచ్చారని విద్యార్థులను ఆయన అభినందించారు. అదేవిధంగా తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానంటూ ఆయన చెప్పుకొచ్చారు.

- Advertisement -

‘ఇప్పుడు సర్వీసులో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ లలో 90 శాతం మంది ప్రభుత్వ బడుల్లోనే చదివారు. చాలా రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్రమంత్రులు సైతం ప్రభుత్వ బడుల్లోనే చదివినవారే. ప్రభుత్వ బడిలో చదివిన నాకు వాటి విలువ బాగా తెలుసు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఇప్పుడు 10/10 జీపీఎస్ సాధించిన విద్యార్థులు మళ్లీ ఇంటర్ లోనూ బాగా రాణించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నానంటూ ఆయన ఆకాంక్షించారు.

Also Read: KCR received Notice: విద్యుత్ కొనుగోళ్ల ఇష్యూ, కేసీఆర్‌కు నోటీస్, వచ్చేనెల 30 తర్వాతే అంటూ…

‘కొంత కాలంగా ప్రభుత్వ స్కూల్స్ నిర్వీర్యమవుతున్నాయి. స్కూళ్లలో టీచర్లు లేరని విద్యార్థులు రావట్లేదు.. విద్యార్థుల్లేరని స్కూల్స్ మూసివేస్తున్నారు. ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుగా తయారయ్యింది. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే.. విద్యార్థులు రారు.. విద్యార్థులు రావడంలేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలన్నింటినీ మూసివేసే పరిస్థితి కొనసాగింది. కొన్ని బడుల్లో విద్యార్థుల కంటే టీచర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తక్షణమే 11 వేల పైచీలుకు పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. సింగిల్ టీచర్ బడుల్ని మూసేయడానికి వీల్లేదని, తండాలు, గూడేల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను నిర్వహించడం వల్ల పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన విద్యను అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: వింత ఘటన.. చనిపోయాడనుకుని కుంటలోంచి బయటకు తీస్తుండగా లేచి నిలబడ్డాడు!

‘ప్రతి విద్యార్థికి అమ్మబడే తొలి పాఠశాల. రెసిడెన్షియల్ స్కూళ్లలో చిన్న చిన్న పిల్లను చేర్పించడం వల్ల వారిని అమ్మఒడికి దూరం చేస్తున్నారు. దీని వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధబాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఓ నివేదికలో తేలింది. ఇదో సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉంది. గతంలో ఒకే సిలబస్ ను ఏళ్ల తరబడి అమలు చేసేవారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చలేదు. ఇకపై విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్ ను మారుస్తాం. ఈ విషయంలో విలువైన సూచనలు ఎవరూ చేసినా తప్పక పాటిస్తాం’ అని సీఎం చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News