Big Stories

Hyderabad to Kuala Lumpur flight: హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ విమానం, టేకాఫ్ అయిన పావుగంటకే మంటలు

Hyderabad to Kuala Lumpur flight: మలేషియా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన పావుగంటకే ఇంజన్‌లో సడన్‌గా మంటలు చెలరేగాయి. వెంటనే పైలట్ చాక చక్యంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. దీంతో విమానంలో ఉన్న 138 మంది సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

బుధవారం అర్థరాత్రి మలేషియా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎంహెచ్ 199 నెంబర్ గల విమానం హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్‌కి బయలుదేరింది. విమానంలో సిబ్బందితోపాటు దాదాపు 138 మంది ట్రావెలర్స్ ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాలకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయ్యింది.

- Advertisement -

కొద్దిసేపటికే విమానం కుడివైపు ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కు అనుమతి కోరారు. పరిస్థితి గమనించిన ఏటీసీ అధికారులు అత్యవసర ల్యాండింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే విమానంలో పెద్ద ఎత్తున ఇంధనం నింపారు.

ALSO READ: ఒకే రన్ వేపై రెండు విమానాలు.. ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం..!

ఈ సమయంలో విమానం ల్యాండింగ్ చేస్తే పెద్ద ఎత్తున మంటలు వస్తాయని భావించి దాదాపు మూడు గంటలపాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. నాలుగు గంటల సమయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో విమాన సిబ్బంది అందులో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News