EPAPER

Hyderabad : కాస్ల్టీ సిటీ హైదరాబాద్.. ప్రపంచంలో ఎన్నో స్థానమంటే..?

Hyderabad : కాస్ల్టీ సిటీ హైదరాబాద్.. ప్రపంచంలో ఎన్నో స్థానమంటే..?

Hyderabad latest news(Telangana news updates): భారత్‌లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం దక్కింది. ఈ జాబితాలో ముంబై టాప్ లో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఉన్నాయి. ఆ తర్వాత హైదరాబాద్, కోల్‌కతా, పుణె ఉన్నాయి. ఈ విషయాన్ని మెర్సర్స్‌ 2023 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే ప్రకటించింది. ప్రతి నగరంలో వసతి, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం లాంటి 200 అంశాలకు అయ్యే ఖర్చు ఆధారంగా ఈ రేటింగ్ ఇచ్చారు.


5 ఖండాల్లోని 227 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రపంచంలో ఖరీదైన నగరాల్లో ముంబై 147వ స్థానంలో ఉంది. ఢిల్లీ 169వ స్థానం, చెనై 184 వ స్థానం, బెంగళూరు 189 వ స్థానం, హైదరాబాద్‌ 202 వ స్థానం, కోల్‌కతా 211 వ స్థానం, పుణె 213వ స్థానంలో ఉన్నాయి. ముంబై కంటే చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణెల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. కోల్‌కతాలో అత్యంత తక్కువ వసతి ఖర్చులున్నాయి సర్వే తేల్చింది.

విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించుకోవాలనుకునే MNCలకు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో షాంఘై, బీజింగ్‌, టోక్యోలతో పోలిస్తే ముంబై, ఢిల్లీ వ్యయాల తక్కువ అని తేలింది. ఆసియాలో అత్యంత ఖరీదైన 35 నగరాల్లో ముంబై, ఢిల్లీకి చోటు దక్కింది. ఆసియా నగరాల్లో ముంబై గతేడాది కంటే ఒక స్థానం తగ్గింది. ప్రస్తుతం 27వ స్థానంలో ఉంది.


ప్రపంచవ్యాప్తంగా హాంకాంగ్‌, సింగపూర్‌, జూరిచ్‌ తొలి 3 స్థానాల్లో నిలిచాయి. చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో హవానా , కరాచీ, ఇస్లామాబాద్‌ ఉన్నాయి.

Tags

Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×