Big Stories

Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్ జారీ..

Rain news in telangana(TS news updates): నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.ఈ ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య కొనసాగుతోంది. దీనికి సమాంతరంగా పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలోనూ మరో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఆవర్తనాల ప్రభావంతో రెండోరోజులపాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

- Advertisement -

తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపుల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భాగ్యనగారానికి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్,పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం తెలంగాణలో సగటు 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

- Advertisement -

మహబూబాబాద్‌ జిల్లా గార్లలో అత్యధికంగా 7.35 సెంటీమీటర్లు, మెదక్‌ జిల్లా ఆర్డీఓ ఆఫీస్‌ ప్రాంతంలో 6.15 సెంటీమీటర్లు, రాజ్‌పల్లిలో 6.05 సెంటీమీటర్ల, ఖమ్మం జిల్లా కారెపల్లిలో 5.78 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 5.58 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News