Big Stories

Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్ !

Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్‌లోని పలు చోట్ల సాయంత్రం భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.  హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అంతే కాకుండా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించింది.

- Advertisement -

నగరంలోని సికింద్రాబాద్, ఎల్బీనగర్, తార్నాక, కోఠి, దిల్‌సుఖ్ నగర్, బేగంపేట్, అమీర్ పేట్, సనత్ నగర్, పంజాగుట్ట, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్‌తో పాటు అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సుమారు రెండు గంటల నుంచి అక్కడక్కడా వర్షం కురుస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా పాతబస్తీ, చార్మినార్, కూకట్ పల్లి, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

- Advertisement -

హైదరాబాద్‌తో పాటు పరసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో నగర ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్  అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తోంది.

Also Read: ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి తుమ్మల

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. వచ్చే 5 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నెల్లూరు, బాపట్ల, నంద్యాల, తిరునతి, కాకినాడ, ఉభయ గోదావరితో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది

ఉత్తర కోస్తా ప్రాంతంలో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ప్రాంతంలోనూ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News