Big Stories

Group 1 Prelims : రేపే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Group 1 Prelims Exam Rules(Latest news in telangana): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్నాహ్నం 1 గంట వరకూ ఓఎంఆర్ విధానంలో పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్ సీ ఏర్పాట్లను పూర్తిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరుకానుండగా.. 895 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

అత్యధికంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 105 కేంద్రాలున్నాయి. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. 10 గంటల్లోగా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష జరగడానికి అరగంట ముందే గేట్లను మూసివేస్తామని స్పష్టం చేశారు. ఒక్కనిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

అభ్యర్థులు తమ హాల్ టికెట్లపై గడిచిన మూడు నెలల్లో తీసుకున్న పాస్ పోర్టు ఫొటోను అతికించాలని, ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును వెంటబెట్టుకుని రావాలని సూచించారు. హాల్ టికెట్ ను A4 సైజు లేజర్ కలర్ ప్రింట్ తీసుకుని రావాలని తెలిపారు. కాగా.. అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉంటుందని TSPSC తెలిపింది. ప్రతి పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ ఉంటుంది. 3-5 కేంద్రాలను తనిఖీలు చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ లు ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News