BigTV English

Ponguleti Team: పొంగులేటి టీమ్ ఇదే.. కేసీఆర్‌కు దేత్తడే!

Ponguleti Team: పొంగులేటి టీమ్ ఇదే.. కేసీఆర్‌కు దేత్తడే!
ponguleti team

Ponguleti latest news(Telangana politics): ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మధ్య డీల్ సెట్ అయింది. వన్ ఫైన్ మార్నింగ్ ఆయన తన టీమ్‌తో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మొత్తం 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు పొంగులేటి కోరగా.. హైకమాండ్ అందుకు ఓకే చెప్పింది. ఎన్నికల సమయంలో జరిగే సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్లు ఇస్తామని అధిష్టానం చెప్పగా.. అందుకు సమ్మతించారు పొంగులేటి. తాను, తమ టీమ్‌తో కలిసి కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరేది రెండుమూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర, కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య సిట్టింగ్‌గా ఉన్న భద్రాచలం మినహా 8 సీట్లు పొంగులేటి టీమ్‌కే ఇవ్వనున్నారు. ఈ 17 సీట్లలో భాగంగా పాలమూరులో రెండు స్థానాలు కోరుతున్నారు జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నుంచి ఆయన బరిలోకి దిగనుండగా.. తన వర్గానికి మరో టికెట్ కోరుతున్నారాయన.

మిగతా స్థానాల విషయానికి వస్తే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ నుంచి పిడమర్తి రవిని బరిలోకి దించనున్నారు. పాలకుర్తి నుంచి ఎన్‌ఆర్‌ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి టికెట్ కోరుతున్నారు. నాగర్‌ కర్నూలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు రంగంలోకి దిగబోతున్నారు. అటు.. డోర్నకల్‌, కొత్తగూడెం నియోజకవర్గాలు కూడా పొంగులేటి వర్గానికే కేటాయించనున్నారు.


పాలేరు నుంచి పొంగులేటి బంధువు రఘురామిరెడ్డి, పినపాక నుంచి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా నుంచి భానోత్ విజయాబాయి, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, సత్తుపల్లి నుంచి కొండూరి సుధాకర్‌రావు, అశ్వరావుపేట నుంచి జారే ఆదినారాయణ బరిలో దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×