Big Stories

Kavitha’s judicial custody extended: ఢిల్లీ లిక్కర్ కేసు… కవితకు దక్కని ఊరట, వచ్చేనెల 7వరకు..

Kavitha’s judicial custody extended: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత ఊరట లభించలేదు. ఆమె జ్యుడీషియల్ కస్టడీని జులై ఏడువరకు పొడిగించింది న్యాయస్థానం. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెని వర్చువల్‌ గా న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

- Advertisement -

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఆమెను హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఆమె కొన్నిరోజులపాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.

- Advertisement -

అనంతరం తీహార్ జైలులో కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అయితే ఆ కస్టడీ ముగియడంతో శుక్రవారం వర్చవల్‌గా హాజరుపరిచారు అధికారులు. దీంతో న్యాయస్థానం ఆమెకు జులై 7 వరకు కస్టడీని పొడిగించింది. లిక్కర్ పాలసీని కవిత తనకు అనుకూలంగా మార్చేందుకు 100 కోట్ల రూపాయలను సౌత్ గ్రూప్ ద్వారా ముడుపులు చెల్లించడంలో ఆమె కీలక పాత్ర పోషించారన్నది అసలు పాయింట్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News