Big Stories

Dharmapuri Srinivas : ధర్మపురి అర్వింద్‌కు పితృవియోగం.. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Dharmapuri srinivas death news(Telangana Congress news): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (75) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన గుండెనొప్పితో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని న్యూరో సిటిజన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్.. ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి. 1948 సెప్టెంబర్ 27న పుట్టిన ఆయన 1989లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి.. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత 1999, 2004 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు.

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. 2004, 2009లో మంత్రిగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక.. 2015లో బీఆర్ఎస్ లో చేరిన ధర్మపురి శ్రీనివాస్.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.

- Advertisement -

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈ నెల 2వ తేదీన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందని .. ఐసీయూకి షిఫ్ట్ చేసి చికిత్స చేస్తున్నారని ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాజాగా తన తండ్రి మృతిపై ధర్మపురి అర్వింద్ దిగ్భ్రాంతి చెందారు. ప్రజల కోసమే కష్టపడాలని నేర్పింది తన తండ్రేనని, తండ్రే తనకు గురవని ట్వీట్ చేశారు. భయపడకుండా ఉండాలని, ప్రజల కోసమే జీవించాలని చెప్పేవారని గుర్తుచేసుకున్నారు.

డీఎస్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మరణం బాధాకరమని X వేదికగా ట్వీట్ చేశారు. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

హోంమంత్రి భట్టి విక్రమార్క డీఎస్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేనిలోటు కాంగ్రెస్ కు తీరని లోటన్నారు. డీఎస్ మృతిపట్ల గుత్తా సుఖేందర్ దిగ్భ్రాంతి చెందారు.

కాంగ్రెస్ సీనియర్ నేత ,మాజీ PCC అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

సాయంత్రానికి డీఎస్ భౌతికకాయాన్ని నిజామాబాద్ కు తరలించనున్నారు. సాయంత్రం నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం మున్నూరు కాపు భవనంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. డీఎస్ మృతి నేపథ్యంలో కడసారి చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. రేపు నిజామాబాద్ లో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

డీఎస్ మృతి పట్ల మంత్రి, మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు డీఎస్ మరణం పట్ల తన బాధను వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటించారు. డీఎస్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ప్రకటించారు. 2004-2009లో అసెంబ్లీలో డీఎస్ అందించిన ప్రోత్సాహం మరువలేనిదని BJP నాయకులు, ఎంపీ కిషన్‌ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి డీఎస్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News