Big Stories

Congress: ఆపరేషన్ ఆకర్ష్‌లో స్పీడు పెంచిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమా..?

Operation Akarsh in Telangana Congress(TS today news): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు రచిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లు సాధించి అధికారిక పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.. కొంత కాలానికే చేరికల కోసం తలుపులు తెరిచినట్లు ప్రకటించింది.

- Advertisement -

కాంగ్రెస్‌లోకి త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొంత మంది చేరనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రారంభం నుంచి పదుల సంఖ్యలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లోకి చేరతారంటూ జోరుగా ప్రచారాలు జరిగాయి. ఆ సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు హస్తం గూటికి చేరారు. అంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావటంతో పాటు.. అటు ఏఐసీసీ నుంచి అనుమతి రాకపోవడంతో చేరికల జోరు తగ్గింది.

- Advertisement -

మాజీ శాసన సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉంటే తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కాకుండా మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అందులో హైదరాబాద్‌కు చెందిన వారు పలువురు ఉన్నట్లు సమాచారం.

Also Read: బీఆర్ఎస్ ప్లాన్, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు.. మహారాష్ట్ర ఫార్ములా

వివిధ జిల్లాలకు చెందిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ శాసన సభా పక్షాన్ని విలీనం చేసుకోవడానికి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరాల్సి ఉంటుందని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతంగా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News