Big Stories

Hyderabad Shops Close 10.30 PM: కొత్త నిబంధనలు.. హైదరాబద్ లో రాత్రి పదిన్నరకు షాపులు క్లోజ్!

Shops Closed 10.30 PM in Hyderabad: లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణలో షాపులు ఇతర వ్యాపార సంస్థలను రాత్రి పదిన్నర కల్లా మూసి వేశాయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులకు కీలక సూచనలు చేశారు. ఇందులోభాగంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -

కొంతకాలంగా రాష్ట్రంలో నేరాల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నమాట. అంతేకాదు రాత్రి వేళ అనవసరంగా వీధుల్లో తిరగవద్దన్నది పోలీసుల ప్రధాన సూచన. ముఖ్యంగా  తెలియనివారికి రాత్రి వేళ వాహనాల్లో లిఫ్ట్ ఇవ్వరాదని, రాత్రివేళ పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగే వారిపై కఠినచర్యలు తప్పవన్నారు. కొద్దిరోజుల కిందట హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఊహించని ఘటనలు జరిగాయి. అయితే పోలీసులు ఆదేశాలపై కొన్ని వ్యాపార వర్గాల నుంచి అభ్యంతరాలు లేక పోలేదు.

- Advertisement -

ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో నైట్ లైఫ్‌పై ఇది ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో షాపులు అర్థరాత్రి వరకు ఉంటున్నాయి. ఈ విషయంలో పోలీసులు అధికారులు కాస్త ఆలోచించాలని కోరుతున్నారు. ఈ సమయాన్ని మరో గంట వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: నార్సింగ్ ఓఆర్ఆర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా, ఒకరు మృతి..

మరోవైపు హైదారాబాద్ చాదర్ ఘాట్, సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్‌షాపు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు పోలీసులు. నిషేధిత గంజాయి, గుట్కా అమ్మకాలపై కఠిన చర్యల నేపథ్యంలో ఈ తనిఖీలను నిర్వహించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News