Big Stories

CM Revanth on Electricity Commission: సీఎం రేవంత్ క్లారిటీ.. కేసీఆర్ లైవ్ ఇమ్మంటే.. విద్యుత్ కమిషన్‌పై కోర్టులో విచారణ..!

CM Revanth on Electricity Commission: విద్యుత్ కమిషన్ వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి నోటీసులకు రాలేనని చెప్పిన కేసీఆర్, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురువారం విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తింది హైకోర్టు.

- Advertisement -

విద్యుత్ కోనుగోళ్లు అక్రమాలపై కమిషన్ విచారణ చేస్తే తప్పేంటని పిటిషనర్ తరపు న్యాయవాదిని న్యాయ స్థానం ప్రశ్నించింది. విచారణ రిపోర్టు వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక చర్చించవచ్చు కదా అని పేర్కొంది. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై కమిషన్ వేయకూడదని తెలిసినా, వేశారని వివరించారు. ఈ క్రమంలో పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం మిగతా విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

మరోవైపు విద్యుత్ కమిషన్ వ్యవహారంపై ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చ జరుగుతున్న సమయంలో ఎవరితోనైనా విచారణ చేయించుకోవచ్చని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, జగదీశ్‌రెడ్డి కోరారన్నారు. వాళ్లు కమిషన్ వేయమని అడిగారని, తాము వేశామన్నారు. కమిషన్ ముందు తమ వాదనలు వినిపించుకోవడానికి కేసీఆర్‌కు సరైన అవకాశం వచ్చిందన్నారు.

సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేయాలని న్యాయస్థానాన్ని కోరామని, అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదన్నారు ముఖ్యమంత్రి. రిటైర్ జడ్జితో కమిషన్ వేయాలన్నారు. తాము కమిషన్ వేసిన మూడునెలల వరకు ఆ పార్టీ నేతలు ఎవరూ నోరు విప్పలేదన్నారు. కేసీఆర్‌కు కమిషన్ లేఖ రాసిన తర్వాతే వాళ్లు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని వివరించారు.

Also Read:  మాజీ సీఎంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్‌కు మాట్లాడే నైతికత లేదని వ్యాఖ్యలు

ఇంతకీ విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేయడం తప్పా? సమాధానం ఇవ్వడానికి కేసీఆర్ తప్పు బడు తున్నారా? జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేయడాన్ని తప్పుబడుతున్నారా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి. వాళ్ల మాటల్లో వ్యత్యాసం ఉందని, ఈ విషయంలో ఏమి మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదన్నారు. వాళ్లు డిమాండ్ చేస్తే.. తాము వేశామన్నారు. కేసీఆర్ అద్భుతమైన వాదనను కమిషన్ ముందు వినిపించుకునే అవకాశం వచ్చిందన్నారు. కమిషన్ ముందుకొచ్చినప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు కావాలని కోరితే తాము ఇస్తామని మనసులోని మాట బయటపెట్టారు.

మొత్తానికి విపక్ష నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా ప్రభుత్వం రిప్లై ఇచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమిషన్ ముందుకు వెళ్లడమే ఉత్తమమని సీనియర్ నేతలు చెబుతున్నమాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News