Big Stories

CM Revanth Reddy Warangal Tour: వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్..ప్రత్యేక జోన్‌గా టెక్స్ టైల్ పార్కు

CM Revanth Reddy on First Visit to Warangal: సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఓరుగల్లుకు చేరుకున్న ఆయనకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క తో పాటు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అయితే వరంగల్ పట్టణంలో సీఎం పర్యటించే మార్గంలో నాయకులు అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ మేరకు ఫ్లెక్సీలు, బ్యానర్లతో నగరమంతా నిండిపోయింది.

- Advertisement -

టెక్స్ టైల్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కైటెక్స్, యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ మాట్లాడారు. టెక్స్ టైల్ పార్కు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే టెక్స్ టైల్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు.

- Advertisement -

అంతకుముందు వరంగల్ చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి..మొదట వరంగల్ టెక్స్ టైల్ పార్క్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం వనమమోత్సవంలో భాగంగా టెక్స్ టైల్ పార్క్ లో మొక్కలు నాటారు. అక్కడి నుంచి ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. అలాగే హన్మకొండలో మహిళా శక్తి క్యాంటీన్ ను సైతం ప్రారంభించారు. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై సమీక్షించనున్నారు.

వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. హన్మకొండ కలెక్టర్ కార్యాలయానికి సీఎం చేరుకున్నారు. ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై అధికారులతో భేటీ అయ్యారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు రెండున్నర గంటల పాటు అభివృద్ధి పనులపై సమీక్షించారు.

Also Read: బీఆర్ఎస్ ప్లేస్ లోకి బీజేపీ.. వాపు చూసి బలుపు అనుకుంటున్నారా ?

మొత్తం 15 అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ, స్మార్ట్ సిటీ పథకం తదితర పనులపై సమీక్షించారు. అలాగే హంటర్ రోడ్డులో నిర్మించిన మెడికవర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News