Big Stories

CM Revanth Reddy: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రెండు రోజుల క్రితం అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఉన్న నివాసంలో ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యే సత్యం నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి ఓదార్చారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన రూపాదేవి చిత్రపటానికి ఆయన పూల మాల వేసి నివాళులర్పించారు. రేవంత్ రెడ్డిని చూడగానే ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన బాధను సీఎంతో చెప్పుకున్నారు. ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యకు గల కారణాలు, అసలేం జరిగిందనే వివరాలను సీఎం రేవంత్ రెడ్డి సత్యంను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఎమ్మెల్యే సత్యం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెంట వెళ్లినవారిలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితోపాటు పలువురు ఉన్నారు.

- Advertisement -

అనంతరం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘భార్యావియోగంతో తీవ్ర దుఖంలో ఉన్న సోదరుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను, కుటుంబ సభ్యులను కొంపల్లిలో ఉన్న ఆయన నివాసంలో పరామర్శించాను. సత్యం సతీమణి రూపాదేవి అకాల మరణం బాధాకరం. వారి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అందులో పేర్కొన్నారు.

Also Read: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 24 నుంచి..

అయితే… అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఎమ్మెల్యే సత్యం దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి సమయంలో ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రూపాదేవి ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నారు. వీరికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని.. భార్యను అలా చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఎమ్మెల్యేను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News