Big Stories

Telangana Song Composing Issue: కీరవాణితో తెలంగాణ గీతంపై ట్రోలింగ్.. తనకు సంబంధం లేదన్న సీఎం రేవంత్!

CM Revanth Reddy Responds on Keeravani Trolling Issue: అందెశ్రీ రచించిన జయ జయహే అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంలో ఎంపిక చేశారన్న విషయం తెలిసిందే. ఈ పాటలో కొన్ని చరణాలను మార్పులు చేర్పులు చేసి.. టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా మూలాలున్న ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. రాష్ట్ర ఆత్మగౌరవంగా భావించే గీతానికి సంగీతాన్ని అందించే బాధ్యత ఒక ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తికెలా ఇస్తారంటూ.. సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

- Advertisement -

తాజాగా ఈ ట్రోలింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో రాచరిక ఆనవాళ్లకు చోటులేదన్నారాయన. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలే గుర్తొస్తాయని, అవి గుర్తొచ్చేలాగే చిహ్నం, గోయం రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర రాజముద్ర రూపకల్పన డిజైన్ బాధ్యతను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కు, రాష్ట్ర గీతం బాధ్యతను.. ఆ పాటను రాసిన అందేశ్రీకి అప్పగించామని చెప్పారు. పాటకు కీరవాణి సంగీతం అందించే విషయంలో తనకెలాంటి సంబంధం లేదని, తుది నిర్ణయం అందెశ్రీకే వదిలేశామని తెలిపారు.

- Advertisement -

Also Read: ఫోన్ ట్యాపింగ్ పై మౌనమెందుకు ? మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్..

ఇదిలా ఉంటే.. తెలంగాణ గీతానికి సంగీతాన్ని సమకూర్చాలని ఆంధ్రా మూలాలున్న కీరవాణికి అవకాశం ఇవ్వడంపై ఒక యువకుడు ఫోన్ లో అందెశ్రీని ప్రశ్నిస్తున్నట్లు ఉన్న ఆడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ విషయంపై అందెశ్రీ స్పందింస్తారో లేదో చూడాలి. మరోవైపు కాంగ్రెస్ నేతలు కీరవాణి పై బీఆర్ఎస్ విమర్శలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో పుల్లెల గోపీచంద్, పీవీ సింధు వంటి వారికి అవకాశాలు ఇచ్చినపుడు గుర్తురాని ఆంధ్రా మూలాలు ఇప్పుడెందుకు గుర్తొచ్చాయని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News