Big Stories

CM Revanth Reddy: ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Cabinet Meeting: ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను వెల్లడించారు.

- Advertisement -

‘వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై కేబినెట్ లో చర్చించాం. వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానం. మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే.. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనం. ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ రూ. 28 వేల కోట్లు. గత ప్రభుత్వం 11 డిసెంబర్ 2018 వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసింది. మా ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీకి దాదాపు రూ. 31వేల కోట్లు అవసరమవుతోంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మా ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

‘రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతోంది. అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని నియమించాం. జులై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం’ అని ఆయన తెలిపారు.

Also Read: సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తాం: కిషన్ రెడ్డి

‘మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారు. వారిద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం.
సమచారం ప్రసారం చేసేముందు మీడియా మిత్రులు ఇది గమనించాలి. రుణమాఫీపై తినబోతూ రుచులెందుకు.. రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. దీనిపై ఎవరికీ శషబిషలు అవసరం లేదు. నియమ నిబంధనలకు సంబంధించి జీవోలో అన్నీ పొందుపరుస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News