Big Stories

CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం.. సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్

CM Revanth Reddy: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నకు శుభాకాంక్షలు తెలిపారు. మల్లన్న విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు.

- Advertisement -

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన చింతపండు నవీన్.. అలియాస్ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై విజయ దుందుభి మోగించారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా.. లెక్కింపు సుదీర్ఘంగా శుక్రవారం అర్థరాత్రి వరకు కొనసాగింది.

- Advertisement -

మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేట్ ప్రక్రియ వరకు తీన్మార్ మల్లన్నకు రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఎలిమినేట్ ప్రక్రియలో రాకేష్ రెడ్డి , మల్లన్న కంటే సుమారు 4 వేల ఎక్కువ ఓట్లు సాధించినా.. అప్పటికే మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 19 వేలకు పైగా ఆధిక్యం దక్కింది.

Also Read: రేపే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు మల్లన్న విజయాన్ని ధ్రువీకరించారు. అయితే మల్లన్న విజయం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పెషల్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్‌కుమార్ కు శుభాకాంక్షలు..మల్లన్న గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు అని ట్వీట్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News