Big Stories

CM Revanth Reddy: మేం పాలకులం కాదు సేవకులం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy laid foundation: మేం పాలకులం కాదు సేవకులమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని మల్లేపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ భవనానికి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ డిజైన్ ను రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిజైన్ గురించి సీఎంకు అధికారులు వివరించారు. అదేవిధంగా పలు సాంకేతిక పరికరాలను కూడా సీఎం పరిశీలించి వాటి వివరాలను తెలుసుకున్నారు.

- Advertisement -

Also Read: కేసీఆర్‌కు అగ్నిపరీక్ష.. బీజేపీ నుంచి తప్పించుకోగలరా ?

- Advertisement -

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సాంకేతికంగా మన విద్యార్థులు మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం వారికి కావాల్సిన సదుపాయాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. మేం పాలకులం కాదు సేవకులం అని సీఎం పేర్కొన్నారు. నిరుద్యోగ యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

CM Revanth Reddy
CM Revanth Reddy

‘తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధి అంశాలే కీలకంగా మారాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ యువతకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీఐలను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాటిని అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారి విలువైన కాలాన్ని వృథా చేయకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నాం. నేను ఇల్లు కట్టుకునే సమయంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి రూ. 15 వేలు, రూ. 20 వేలు పనిచేస్తామని చెప్పారు. అదే మేస్త్రీలు, నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారిని సంప్రదిస్తే రూ. 60 వేలు అడిగారు. సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచడంలేదని ఆరోజు అర్థమైంది. అందుకే ఎంతోమంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇక్కడే అలాంటి ఉపాధి అవకాశాలు కల్పించి ఎవరూ విదేశాలకు వెళ్లకుండా చేస్తాం. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలను తీసుకొచ్చి యువతకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాం. ఈ ప్రయత్నంలో తోడ్పడేందుకు ముందుకొచ్చిన టాటా సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం నలుమూలలా 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టబోతున్నాం. దీనిపైనే నేను ప్రత్యేక దృష్టి సారిస్తా. ప్రతి నెలా సమీక్ష చేస్తా’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read: ఆర్టీసీ బస్సులో మరోసారి ప్రయాణించిన మంత్రి సీతక్క

కాగా, రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ. 2,324.21 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నది. ఐటీఐలను అడ్వాన్స్ డ్ అప్ గ్రేడ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చనున్నది. ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా వాటిలో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News