Big Stories

CM Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు

CM Revanth Reddy Launch of CMRF website: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎంఆర్ఎప్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రత్యేక వెబ్ సైట్‌ను ప్రారంభించింది.

- Advertisement -

సెంటర్ ఫర్ గుడ్ గవర్నర్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్ సైట్‌ను సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ నెల 15 వ తేదీ తర్వాత సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నారు. కాగా.. https://cmrf.telangana.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Also Read : వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పనిచేస్తే కుదరదు: అధికారులకు సీఎం వార్నింగ్

సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే దరఖాస్తుదారుల వివరాలతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖలను జత చేసి అప్ లోడ్ చేయనున్నారు. తర్వాత దరఖాస్తులో సంబంధిత లబ్ధిదారుడు బ్యాంక్ ఖాతా నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను అప్ లోడ్ చేసిన వెంటనే కోడ్ నంబర్ వస్తుంది. ఈ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

అయితే, ఈ దరఖాస్తును ఆన్ లైన్‌లో సంబంధిత ఆస్పత్రికి పంపించి నిర్ధారణ చేసుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకొని ఆ తర్వాత ఆమోదించి చెక్కు సిద్ధం చేయనున్నారు. ఈ చెక్కుపై లబ్ధిదారుడి సంతకాన్ని ముద్రించనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందజేస్తారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News