Big Stories

CM Revanth Reddy in Punjab: పంజాబ్ కు సీఎం రేవంత్.. ఆ తర్వాత సోనియాతో సమావేశం..!

CM Revanthreddy in Punjab: దేశంలో సార్వత్రిక ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. చివరిదైన ఏడో విడతపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ముఖ్యంగా దక్షిణాది నుంచి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉత్తరాది బాట పట్టారు. ఆ జాబితాలో ముందు ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డి పంజాబ్‌కి వెళ్తున్నారు. అక్కడ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి పంజాబ్‌‌లో చతుర్ముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్, శిరోమణి అకాళీదల్ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్-ఆప్ మధ్య ఉంటుందని అక్కడి నేతలు చెబుతున్నారు.

- Advertisement -

గత ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్ మెరుగైన సీట్లను సాధించింది. 13 సీట్లకు గాను ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. అకాలీదల్, బీజేపీ రెండేసి స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఆప్ ఒక్క స్థానానికి పరిమితమైంది. అయితే ప్రస్తుతం పంజాబ్‌లో ఆప్ సర్కార్ ఉంది. ఈ క్రమంలో సగానికి పైగానే సీట్లు గెలుసుకోవాలని భావిస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయి అంచనాలు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంజాబ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి వంతైంది. ఇక్కడ జూన్ ఒకటిన ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Also Read: కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్.. బరిలో 52 మంది అభ్యర్థులు

పంజాబ్ టూర్ ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యే అవకాశముందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆమెను ముఖ్య అతిధిగా ఆహ్వానించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News