Big Stories

CM Revanth Reddy Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ ఎంపికపై చర్చిస్తారా..?

CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంతో పాటు పలువురు ఎంపీలు, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా హస్తినకు వెళ్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి సమావేశం అవుతారు. మొదటిరోజు పార్టీ కార్యక్రమాలపై హస్తం పార్టీ పెద్దలతో సీఎం చర్చలు జరుపుతారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు.

- Advertisement -

నూతన పీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనే అంశంపై పెద్దలతో చర్చించనున్నారు. ఇక రెండో రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులతో రేవంత్‌ భేటీ అవుతారు. రేపు నూతనంగా ఎన్నికైన లోక్ సభ ఎంపీల ప్రమాణస్వీకారంలో రేవంత్‌ పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర పట్టణాభివృద్ధి, జలశక్తి శాఖల మంత్రులతో రేవంత్‌రెడ్డి సమావేశమై.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లపై వినతి పత్రాలు అందిస్తారు.

- Advertisement -

Also Read: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకు కసరత్తు జరుగుతుండగా.. ఆ విషయంపై కూడా రేవంత్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో రేవంత్ తో కలిపి 11 మంది ఉండగా.. మరో ఆరుగురికి చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. వాటిలో నలుగురికి ఇప్పుడు స్థానం కల్పిస్తారని సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గుచూపుతుండగా.. సీనియర్లెవరైనా వస్తే మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక రేపు పార్లమెంట్ లో జరిగే కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News