Big Stories

CM Revanth Reddy: మాజీ సీఎంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్‌కు మాట్లాడే నైతికత లేదని వ్యాఖ్యలు..!

CM Revanth Reddy fires on KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేదని సీఎం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చేశాయన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోందని, అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని సీఎం వెల్లడించారు. ఇక విద్యాశాఖ విషయానికొస్తే.. నా పరిధిలోనే ఉందని చెప్పారు.

- Advertisement -

పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నైతికత లేదన్నారు. గత పదేళ్లల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తన పార్టీలో చేర్చుకున్నారని, ఈ విషయం కేసీఆర్‌కు గుర్తు లేదా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంపై సీఎం మాట్లాడారు. సమాచారం ఇవ్వకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే సీనియర్ నేతగా ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుందన్నారు. టీపీసీసీ విషయంలో కొంత సమన్వయ లోపంతో ఇలా జరిగిందని, అయితే జీవన్ రెడ్డి గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా తాము చూసుకుంటామని చెప్పారు.

Also Read: భూకబ్జాలపై రేవంత్ పంజా.. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం

పీసీసీ అధ్యక్ష పదవీ కాలం మూడేళ్లు అని, కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్ఠానానికి చెప్పామన్నారు. ఇప్పటివరకు అన్ని సవ్యంగానే చేశామన్నారు. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో జీవన్ రెడ్డి సలహాలు తీసుకుంటామన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేస్తామన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే బీఆర్ఎస్ ఓట్లను 20శాతానికిపైగా బీజేపీకి బదిలీ చేయించారన్నారు. సిరిసిల్ల, సిద్దిపేటలోనూ బీజేపీకి మెజార్టీ ఓట్లు పడ్డాయని, దీనికి అర్థం ఏంటో తెలపాలన్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్.. ఇప్పుడు ఫామ్ హౌస్ తలపులు తెరిచారన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరినట్లు చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News