Big Stories

CM Revanth Reddy: ట్రాఫిక్ కానిస్టేబుల్‌ చేసిన సాయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు

CM Revanth Reddy Congrats to Constable: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు నిబంధనలు కఠినంగా అమలు చేశారు. అరగంట ముందే గేట్లను మూసివేశారు. అయితే ఒక్క నిమిషం నిబంధనతో ఆలస్యంగా వెళ్లిన కొంతమంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. పలు కేంద్రాల్లో ఆలస్యంగా వెళ్లిన మహిళా అభ్యర్థులను పరీక్ష లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో కంటతడి పెట్టారు. అయితే పరీక్షకు హడావిడిగా వెళ్తున్న ఓ యువతిని ట్రాఫిక్ కానిస్టేబుల్ పరీక్ష కేంద్రానికి తరలించిన తీరు సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

- Advertisement -

ఆల్ ది బెస్ట్..
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాయాల్సిన ఓ యువతిని ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సురేష్‌ను అభినందించారు. ‘వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా.. సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్‌కు నా అభినందనలు. సురేష్ సహాయంతో పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకొని పరీక్ష రాసిన సోదరి.. యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.’ అంటూ ’ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

- Advertisement -

Also Read: ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక ఆధారాలు లభ్యం.. మరింత వేగం పెంచిన అధికారులు

ఏం జరిగిందంటే?
యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు ఓ యువతి ఆర్టీసీ బస్సులో వెళ్లింది. రాజేంద్రనగర్‌లోని మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సిన ఆ యువతి.. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలార్ దేవుపల్లి పల్లెచెరువు బస్టాప్ వద్ద దిగింది. అయితే సమయం మించి పోవడంతోపాటు పరీక్ష కేంద్రానికి చాలా దూరం ఉండడంతో ఆ యువతి కంగారు పడుతోంది. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ గమనించాడు. వెంటనే ఆ యువతి వద్దకు వెళ్లి ఏమైందని ఆరా తీశాడు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్.. బాధ్యతగా ఆ యువతిని పోలీస్ బైకుపై పరీక్ష కేంద్రం వద్దకు సమయానికి తీసుకెళ్లి దిగబెట్టాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News