Big Stories

Rahul Gandhi’s 54th Birthday: రాహుల్ గాంధీ బర్త్ డే.. విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Wishes to Rahul Gandhi(Telangana news live): ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలుచోట్లు జరిగిన వేడుకల్లో కేక్ కటింగ్, స్వీట్లు, పండ్ల పంపిణీ కార్యక్రమాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఆస్పత్రులు, అనాథాశ్రమాల్లో పండ్లు పంచిపెట్టారు. ఈసందర్భంగా పలు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో కాంగ్రెస్ నేతలు పూజలు నిర్వహించారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యకర్తలు ఆలయాల్లో పూజలు నిర్వహించి, స్వీట్లు పంచిపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. బడుగుబలహీన వర్గాలకు అండగా నిలుస్తూ, అరాచకాలపై నిరంతరం పోరాడే ధీరుడు రాహుల్ అని పేర్కొన్నారు. భావిభారత స్వప్నాలను సాకారం చేయగల రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలని రేవంత్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Also Read: కేసీఆర్‌కు కరెంటు షాకులు.. చత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంలో తిరకాసులేంటి?

గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పీసీసీ ఫిషరీస్ విభాగం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News